Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆరు ప్రాంఛైజీలు ఐపీఎల్ జట్ల యాజమానుల సొంతం
న్యూఢిల్లీ : గ్లోబల్ టీ20 లీగ్ దిశగా దక్షిణాఫ్రికా క్రికెట్ (సీఎస్ఏ) ఎట్టకేలకు సక్సెస్ సాధించింది. తాజాగా నిర్వహించిన దక్షిణాఫ్రికా టీ20 లీగ్ ప్రాంఛైజీల వేలంలో.. ఐపీఎల్ ప్రాంఛైజీల యాజమానులే జట్లను సొంతం చేసుకున్నారు. సీఎస్ఏ తొలుత పది నగరాలను ఎంపిక చేయగా అందులో ఆరు నగరాలను ఖరారు చేశారు. డెలాయిట్ కార్పోరేట్ ఫైనాన్స్ నిర్వహించిన ఓపెన్ బిడ్‌లో 29 బిడ్డర్లు ప్రాంఛైజీలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించారు. ముంబయి ఇండియన్స్, లక్నో సూపర్‌జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్‌కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ప్రాంఛైజీల యజమానులు వరుసగా కేప్‌టౌన్, డర్బన్, పోర్ట్ ఎలిజబెత్, జొహనెస్‌బర్గ్, పార్ల్, ప్రొటెరియ నగరాలు వేదికగా ప్రాంఛైజీలు సొంతం చేసుకున్నాయి. ఈ విషయాన్ని దక్షిణాఫ్రికా క్రికెట్ ఓ ప్రకటనలో తెలిపింది. సఫారీ టీ20 లీగ్‌లో పూర్తిగా ఐపీఎల్ జట్ల యాజమాన్యాలే ఉండటంతో లీగ్‌పై అభిమానుల్లో ఆసక్తి భారీగా పెరగనుంది.