Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌తో కోట్ల ఆర్జన
న్యూఢిల్లీ : ప్రపంచ క్రికెట్ సూపర్‌స్టార్ విరాట్ కోహ్లి ఆటలో ఫామ్ కోల్పోయి కాస్త ఇబ్బందులు పడుతున్నా.. అభిమానుల్లో, మార్కెట్లో అతడి క్రేజ్, విలువ ఏమాత్రం తగ్గలేదు. అందుకు అతడి సోషల్ మీడియా పోస్ట్‌ల ద్వారా ఆర్జిస్తున్న ఆదాయమే నిదర్శనం!. ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌ల ద్వారా అత్యధిక ఆదాయం ఆర్జిస్తున్న క్రీడాకారుల జాబితాలో విరాట్ కోహ్లి మూడో స్థానంలో నిలిచాడు. తొలి రెండు స్థానాల్లో ఫుట్‌బాల్ దిగ్గజాలు క్రిస్టియానో రొనాల్డో (పోర్చుగల్), లియోనల్ మెస్సీ (అర్జెంటీనా) ఉన్నారు. క్రిస్టియానో రొనాల్డొ ఒక్క ఇన్‌స్టా పోస్ట్‌తో ఏకంగా రూ.19 కోట్లు ఆర్జిస్తున్నాడు. సాకర్ స్టార్ లియోనల్ మెస్సీ ఒక్క ఇన్‌స్టా పోస్ట్‌కు రూ.14 కోట్ల ఆర్జనతో ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. మూడో స్థానంలో క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లి నిలిచాడు. ఒక్క కమర్షియల్ పోస్ట్‌కు విరాట్‌కోహ్లి రూ.8.9 కోట్ల ఆదాయం ఆర్జిస్తున్నాడు. మరే క్రికెటర్‌కు సైతం టాప్-10లోనూ చోటు దక్కలేదు. విరాట్ కోహ్లి కమర్షియల్ ఒప్పందాల్లో సైతం అంతర్జాతీయ అథ్లెట్లతో పోటీపడుతున్న సంగతి విదితమే. ఒక్క పుమాతో సంస్థతోనే విరాట్ కోహ్లి ఎనిమిదేండ్లకు ఏకంగా రూ.100 కోట్ల భారీ ఒప్పందం కుదుర్చుకున్న రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే.