Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాణించిన శుభ్‌మన్, శ్రేయస్
- వెస్టిండీస్‌తో భారత్ తొలి వన్డే
పోర్ట్ ఆఫ్ స్పెయిన్ : నాయకత్వ బాధ్యతల్లో శిఖర్ ధావన్ కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో తేలిపోయిన గబ్బర్.. కరీబియన్ దీవుల్లో కెప్టెన్‌గా రెచ్చిపోతున్నాడు. వెస్టిండీస్‌తో తొలి వన్డేలో శిఖర్ ధావన్ (97, 99 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. టాస్ నెగ్గిన వెస్టిండీస్ తొలుత భారత్‌కు బ్యాటింగ్ అప్పగించింది. శుభ్‌మన్ గిల్ (64, 53 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) తోడుగా ఇన్నింగ్స్‌ను ఆరంభించిన శిఖర్ ధావన్ విండీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. తొలి ఓవర్లోనే బౌండరీల మోత మోగించిన ధావన్.. గిల్‌తో కలిసి ధనాధన్ ఆరంభాన్ని అందించాడు. గిల్, ధావన్ ధనాధన్‌తో 6.5 ఓవర్లలో భారత్ 50 పరుగుల మార్క్ చేరుకుంది. ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లతో శుభ్‌మన్ గిల్ 36 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తి చేసుకుఆన్నడు. మరోవైపు శిఖర్ ధావన్ ఎనిమిది ఫోర్లు, ఓ సిక్సర్‌తో 53 బంతుల్లో అర్థ సెంచరీ సాధించాడు. ఈ జోడీ తొలి వికెట్‌కు 119 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదు చేసింది. అర్థ సెంచరీ అనంతరం శుభ్‌మన్ గిల్ నిష్క్రమించినా.. శ్రేయస్ అయ్యర్ (54, 57 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు)తో కలిసి శిఖర్ ధావన్ జోరు కొనసాగించాడు. అయ్యర్, ధావన్ రెండో వికెట్‌కు 94 పరుగులు జోడించారు. వైఫల్య యాత్రకు బ్రేక్ వేసిన అయ్యర్ అర్థ సెంచరీతో కదం తొక్కాడు. శతకానికి మూడు పరుగుల దూరంలో ధావన్ వికెట్ కోల్పోగా.. అర్థ సెంచరీ అనంతరం అయ్యర్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. టాప్-3 బ్యాటర్ల జోరుతో భారత్ 230/2తో పటిష్టమైన స్థితిలో కనిపించింది. సూర్యకుమార్ యాదవ్ (13), సంజు శాంసన్ (12)ల వరుస వికెట్లతో భారత్ 252/5తో భారీ స్కోరు ఆశలకు దూరమైంది!. తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత్ 45 ఓవర్ల ఆట అనంతరం 263/5తో కొనసాగుతోంది.