Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీసీసీఐ సరికొత్త ఆలోచన
ముంబయి : ఓ వైపు వేల కోట్లు ఆదాయం ఆర్జిస్తున్న భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ).. మరోవైపు ఖర్చులు గణనీయంగా తగ్గించుకునే మార్గాలు అన్వేషిస్తోంది. ఏజ్ గ్రూప్ క్రికెట్లో వయసు నిర్థారణకు బీసీసీఐ ప్రస్తుతం టీడబ్యూ3 విధానం అనుసరిస్తోంది. నూతన సాఫ్ట్వేర్ విధానంతో బీసీసీఐకి సుమారుగా 80 శాతం ఖర్చు కలిసిరానుంది. తప్పుడు వయసు దృవ పత్రాలపై బీసీసీఐ కఠిన వైఖరి అవలంభిస్తోంది. ఇందులో భాగంగా ఎడమ చేతి, మణికట్టు ఎక్స్‌రేలను పరీక్షకు పంపిస్తారు. రాష్ట్ర క్రికెట్ సంఘాలు ఎక్స్‌రేలను దగ్గరుండి తీయించి.. వాటికి బోర్డుకు పంపుతాయి. బీసీసీఐ వద్ద నలుగురు రేడియాలజస్ట్లు ఉన్నారు. ఒక్కో రేడియాలజిస్ట్ 8-9 రాష్ట్ర సంఘాల ఎక్స్‌రే నివేదికలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియకు సుమారు రెండు నెలల సమయం పడుతుంది. నూతన విధానంలో సాఫ్ట్వేర్ పద్దతిలోనే ఎక్స్‌రేల ఆధారంగా వయసు నిర్దారణ చేయవచ్చు. ఇప్పటికే బోర్డు దీనిని ప్రయోగాత్మకంగా అమలు చేయగా.. సానుకూల ఫలితాలు వచ్చాయి. ఈ ఏడాది టిడబ్య్లూ3తో పాటు సాఫ్ట్వేర్ పద్దతిని అమలు చేసి.. తర్వాత పూర్తిగా సాఫ్ట్‌వేర్‌పైనే ఆధారపడే ందుకు బోర్డు ఆలోచనలు చేస్తోంది. ప్రస్తుత విధానంలో ఒక్కో ఎముక వయసు నిర్దారణ పరీక్షకు రూ.2400 అవుతుండగా.. సాఫ్ట్‌వేర్‌తో రూ.288 మాత్రమే అవుతోంది.