Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రచారకర్తగా షట్లర్ సాయిప్రణీత్
నవతెలంగాణ, హైదరాబాద్ : సమస్త క్రీడా సమాచారం అభిమానులకు అందించటమే లక్ష్యంగా సరికొత్త స్పోర్ట్స్ న్యూస్ యాప్ వచ్చింది. భారత బ్యాడ్మింటన్ స్టార్ బి. సాయిప్రణీత్ ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న 'వాట్స్ ఇన్ ద గేమ్' స్పోర్ట్స్ న్యూస్ యాప్‌ను శనివారం హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, వాణిజ్య శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ ముఖ్య అతిథిగా హాజరై యాప్ లోగోను ఆవిష్కరించారు. ' అన్ని క్రీడలకు సంబంధించిన సమాచారం ఒకే చోట దొరకదు. ప్రొఫెషనల్‌గానూ ఒక్కో క్రీడలకు సంబంధించిన వార్తలను ఒక్కో వెబ్సైట్లో చూడాల్సి ఉంటుంది. అలా కాకుండా, సమస్త క్రీడా సమాచారం ఒకే దగ్గర అందుబాటులో ఉంచాలనే ఆలోచనతో దీన్ని తీసుకొచ్చాం. సంక్షిప్త వార్తలు సహా షెడ్యూల్స్, మ్యాచ్ విశ్లేషణలు ఇక్కడ పొందుపరుస్తారు. భవిష్యత్‌లో మెటావర్స్‌ను సైతం తీసుకొచ్చేందుకు ఆలోచన ఉందని' సాయిప్రణీత్ తెలిపారు. కార్యక్రమంలో వాట్స్ ఇన్ ది గేమ్ స్టార్టప్ వ్యవస్థాపకులు అనిల్ కుమార్ మామిడాల, ఈజెబి ప్రమీల తదితరులు పాల్గొన్నారు.