Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్టార్ బాక్సర్ ట్వీట్ ప్రభావం
బర్మింగ్‌హామ్ : భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ), భారత బాక్సింగ్ సమాఖ్యలు అథ్లెట్లతో రాజకీయాలు చేస్తున్నారని ఒలింపిక్ పతక విజేత, స్టార్ బాక్సర్ లవ్లీనా బొర్గొహైన్ ట్విట్టర్ వేదికగా విమర్శలు చేయటం భారత బాక్సింగ్ ఫెడరేషన్లో ప్రకంపనలు సృష్టించింది. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన లవ్లీనా బొర్గొహైన్ వ్యక్తిగత కోచ్ సంధ్యకు కామన్వెల్త్ క్రీడా గ్రామంలో అనుమతి ఇవ్వలేదు. ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్స్‌లోనూ ఇదే విధంగా చేశారని, అది ఓవరాల్‌గా ప్రదర్శనపై ప్రతికూల ప్రభావం చూపిందని లవ్లీనా తెలిపింది. కామన్వెల్త్ క్రీడల్లో భారత్ నుంచి 12 మంది బాక్సర్లు పోటీపడుతున్నారు. వీరికి 8 మంది సహాయక సిబ్బందికి ఐఓఏ అనుమతి లభించింది. వీరిలో లవ్లీనా వ్యక్తిగత కోచ్ లేరు. లవ్లీనా ట్వీట్‌తో ఆమె కోచ్ సంధ్యకు అక్రిడిటేషన్ మంజూరు చేసిన ఐఓఏ.. ఆమెకు క్రీడా గ్రామంలో గదిని సైతం కేటాయించారు.