Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గాయంతో తప్పుకున్న స్టార్ అథ్లెట్
- బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్ 2022
న్యూఢిల్లీ : ప్రతిష్టాత్మక బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ క్రీడల్లోకు భారత్‌కు గట్టి ఎదురుదెబ్బ. ఒలింపిక్, ఆసియా చాంపియన్ నీరజ్ చోప్రా గాయంతో కామన్వెల్త్ క్రీడలకు దూరమయ్యాడు. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌లో సిల్వర్ మెడల్‌తో చారిత్రక ఘట్టాన్ని ఆవిష్కరింపజేసిన నీరజ్ చోప్రా..బర్మింగ్‌హామ్ క్రీడల్లో భారత బృందంలో అత్యంత కీలక అథ్లెట్. చారిత్రక పతక విన్యాసం అనంతరం ఫిట్నెస్ ఇబ్బందులు ఎదుర్కొన్న నీరజ్ చోప్రా కామన్వెల్త్ క్రీడల నుంచి తప్పుకున్నాడు. ఈ మేరకు భారత ఒలింపిక్ సంఘం ఓ ప్రకటనలో తెలిపింది. 2018 గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ క్రీడల్లో నీరజ్ చోప్రా బంగారు పతకం సాధించాడు.
ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌లో 88.13 మీటర్ల త్రో విసిరిన నీరజ్ చోప్రా.. బర్మింగ్‌హామ్‌లోనూ పసిడి పతకం లాంఛనం చేసుకున్నాడు. కానీ, ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్ ఫైనల్స్ అనంతరం గజ్జల్లో గాయం బారిన పడ్డాడు. స్కాన్, ఎక్స్‌రే నివేదికలను పరిశీలించిన వైద్య బృందం నీరజ్ చోప్రాకు కనీసం నెల రోజుల విశ్రాంతి అవసరమని తెలిపింది. ఈ విషయాన్ని ఐఓఏ కార్యదర్శి రాజీవ్ మెహతా వెల్లడించారు.