Authorization
Mon April 07, 2025 11:48:56 am
చెన్నై: కబడ్డీ ఆటలో భాగంగా కూతకు వెళ్లి ఓ ఆటగాడు తుదిశ్వాస విడిచిన సంఘటన తమిళనాడులోని సేలం జిల్లా మనడికుప్పుం గ్రామంలో చోటుచేసుకుంది. మనడికుప్పంలో నిర్వహించిన కబడ్డీ పోటీల్లో భాగంగా విమల్రాజ్ కూతకు వెళ్లాడు. ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు అతడిని పట్టుకోబోగా ఎగిరి లైన్ దగ్గర వచ్చి పడ్డాడు. ఈ క్రమంలో మరో ప్లేయర్ అతడిని అడ్డుకోబోతుండగా అతడి మోకాలు.. విమల్రాజ్ ఛాతిలో బలంగా తాకింది. అయితే అప్పటికే విమల్రాజ్ లైన్ను తాకడంతో రిఫరీ అతడికి రెండు పాయింట్లు ఇస్తూ విజిల్ వేశాడు. మరోవైపు విమల్రాజ్ కిందపడ్డచోటు నుంచి లేస్తూ అక్కడే కుప్పకూలిపోయాడు. అతడ్ని హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే అతడు మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.