Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారతజట్ల మెంటార్‌గా విశ్వనాథన్
- 187దేశాలనుంచి 1400మంది ప్లేయర్స్
చెన్నై: ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌కు భారత్ తొలిసారి ఆతిథ్యమిస్తోంది. చెన్నై వేదికగా నెహ్రూ స్టేడియంలో గురువారం జరిగే జ్యోతి ప్రజ్వలనతో 44వ చెస్ ఒలింపియాడ్ ప్రారంభం కానుంది. గత నెలలో ప్రధాని చేతుల మీదుగా ప్రారంభమైన టార్చ్ రిలే బుధవారం చెన్నైలోని ప్రెసిడెన్సీ కళాశాల మైదానానికి చేరుకుంది. గురువారం టార్చ్ రిలే నెహ్రూ స్టేడియంకు చేరుకోనుంది. చెస్ ఒలింపియాడ్‌లో 187 దేశాలనుంచి సుమారు 1400మంది గ్రాండ్‌మాస్టర్లు పాల్గోనున్నారు. పురుషుల, మహిళలకు వేర్వేరుగా 11రౌండ్లలో జరిగే ఈ పోటీల్లో రష్యా, చైనా జట్లు ఫేవరెట్‌గా బరిలోకి దిగనున్నాయి. నార్వేకు చెందిన మాగస్ కార్ల్సన్ వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పతకం సాధించగల గ్రాండ్ మాస్టర్. ఆతిథ్య హోదాలో భారత్ రెండు విభాగాల్లోనూ నేరుగా ఎంట్రీ లభించింది. మొత్తం 30మంది గ్రాండ్మాస్టర్లలో 15మంది మహిళా ప్లేయర్స్ ఉన్నారు. జట్టు మెంటార్‌గా విశ్వనాథన్ ఆనంద్ వ్యవహరించనుండగా.. మహిళల జట్టుతో పోలిస్తే పురుషుల జట్టు పటిష్టంగా కనబడుతోంది. గుకేశ్, అర్జున్, నిహాల్, ఆర్ ప్రజ్ఞానంద పతకాలు సాధించగల యువ గ్రాండ్‌మాస్టర్లు. నాలుగు నెలల క్రితం భారత్‌కు ఆతిథ్య హక్కులు దక్కడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా ఈ టోర్నీని నిర్వహిస్తున్నాయి.