Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రేపు మహిళల క్రికెట్లో భారత్×ఆస్ట్రేలియా అమీతుమీ
బర్మింగ్‌హామ్: ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్ వేదికగా జులై 28నుంచి ఆగస్టు 8వరకు కామన్వెల్త్ గేమ్స్ జరగనున్నాయి. గురువారం కామన్వెల్త్ గేమ్స్ ప్రారంభోత్సవ వేడుకలు జరగనుండగా.. 8న ముగింపు ఉత్సవాలు జరగనున్నాయి. 29నుంచి క్రీడాపోటీలు ప్రారంభం కానున్నాయి.
కామన్వెల్త్ గేమ్స్‌లో తొలిసారి మహిళల క్రికెట్‌కు చోటు దక్కడంతో ఓ పతకం దక్కడం ఖాయంగా కనబడుతోంది. టి20 ఫార్మాట్లో జరిగే పోటీలో గ్రూప్-ఏలో ఉన్న భారత్ తన తొలి మ్యాచ్‌ను 29న పటిష్ట ఆస్ట్రేలియాతో, 31న పాకిస్తాన్, ఆగస్టు 3న బార్డొడాస్తో తలపడనుంది. ఇక గ్రూప్-బిలో ఉన్న న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, ఇంగ్లండ్ జట్లు ఉన్నాయి. రెండు గ్రూపుల్లోని జట్లు లీగ్ ముగిసిన అనంతరం టాప్-2లో ఉన్న జట్లు సెమీస్‌కు చేరనున్నాయి. మహిళా బాక్సర్లు లౌలీనా బోర్గోహైన్, నిఖత్ జరీన్లో స్వర్ణ పతకాలు సాధించగల సత్తా వీరికి ఉంది. ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో నిఖత్, టోక్యో ఒలింపిక్స్‌లో లౌల్లీనా అద్భుత ప్రదర్శనతో అదరగొట్టిన విషయం తెలిసిందే. నీరజ్ చోప్రా కామన్వెల్త్ గేమ్స్‌కు దూరం కావడంతో ఓ స్వర్ణ పతకం భారత్‌కు చేజారినట్లే. పివి సింధు(బ్యాడ్మింటన్), మనిక బత్ర(టేబుల్ టెన్నిస్), మీరాభాయి ఛాను(వెయిట్ లిఫ్టింగ్), బజరంగ్ పునియా(రెజ్లింగ్), లౌల్లీనా బోర్గోహైన్, నిఖత్ జరీన్(బాక్సింగ్) స్వర్ణ పతకాలు సాధించగల సమర్థులు.
ఈసారి షూటింగ్, రెజ్లింగ్, వెయిట్‌లిఫ్టింగ్‌లో ఈసారి భారత్‌కు ఎక్కువ పతకాలు వచ్చే అవకాశముంది. గత కామన్వెల్త్ గేమ్స్‌లో రెజ్లర్లు 12, వెయిట్ లిఫ్టర్లు 9 పతకాలు సాధించారు. గతంలో మాదిరిగా ఈసారి రెజ్లింగ్‌లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించే 12మంది కూడా పతకాలు సాధించగల సత్తా గల రెజ్లర్లే.
కామన్వెల్త్ గేమ్స్ క్రీడాంశాలు: స్విమ్మింగ్, బ్యాడ్మింటన్, బాస్కెట్‌బాల్, బాక్సింగ్, క్రికెట్, సైక్లింగ్, జిమ్నాస్టిక్స్, హాకీ, లాన్ బౌల్స్, నెట్‌బాల్, రగ్బీ(సెవెన్), స్క్వాష్, టేబుల్ టెన్నిస్, ట్రయథ్లాన్, వెయిట్‌లిఫ్టింగ్, బీజ్ వాలీబాల్, బాస్కెట్‌బాల్, అథ్లెటిక్స్, జూడో.