Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శ్రీలంకకే ఆతిథ్య హక్కులు
దుబాయ్ : ఊహించినట్టు గానే ఆసియా కప్ 2022 యుఏఈలో జరుగనుంది. శ్రీలంకలో ప్రస్తుతం ఆర్థిక, రాజకీయ పరిస్థితులు అస్తవ్యస్థంగా ఉండటంతో వేదిక మార్పు అనివార్యమైంది. ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 11 వరకు జరుగనున్న ఆసియా కప్ (టీ20 ఫార్మాట్) ఆతిథ్య హక్కులు మాత్రం శ్రీలంక క్రికెట్ బోర్డు వద్దనే ఉండనున్నాయి. ఈ మేరకు ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు జై షా ఓ ప్రకటనలో తెలిపాడు. ' ఆసియా కప్‌ను శ్రీలంకలో నిర్వహించేందుకు అన్ని ప్రయత్నాలు చేశాం. విస్తృత సంప్రదింపుల అనంతరం ఆసియా కప్ వేదికను యుఏఈకి మార్పు చేస్తున్నాం. యుఏఈ ఆతిథ్య వేదికగా ఉన్నప్పటికీ.. ఆతిథ్య హక్కులు శ్రీలంక క్రికెట్ బోర్డుకే ఉంటాయి' అని జై షా తెలిపారు. తొమ్మిది జట్లు పోటీపడే ఆసియా కప్ చివరగా 2018లో నిర్వహించారు. బారత్ డిఫెండింగ్ చాంపియన్‌గా ఆసియా కప్ బరిలోకి దిగనుంది. అర్హత రౌండ్లో యుఏఈ, కువైట్, సింగపూర్, హాంగ్‌కాంగ్ పోటీపడనున్నాయి. అర్హత టోర్నీలో విజేతగా నిలిచిన జట్టు శ్రీలంక, భారత్, పాకిస్థాన్, అఫ్గనిస్థాన్, బంగ్లాదేశ్‌లతో ప్రధాన టోర్నీలో పోటీపడనుంది.