Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జింబాబ్వేతో వన్డే సిరీస్‌కు జట్టు ఎంపిక
ముంబయి : గాయంతో ఐపీఎల్ 2022కు దూరమైన దీపక్ చాహర్.. పూర్తి ఫిట్నెస్తో జాతీయ జట్టులో అడుగుపెట్టాడు. ఏడాది ఆరంభంలో వెస్టిండీస్‌తో స్వదేశీ సిరీస్‌లో ఆడిన దీపక్ చాహర్.. జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో రిహాబిలిటేషన్ లో కొనసాగుతుండగా గాయం బారిన పడ్డాడు. తాజాగా జింబాబ్వేతో మూడు మ్యాచుల వన్డే సిరీస్‌కు దీపక్ చాహర్ జట్టులోకి ఎంపికయ్యాడు. ఆరు నెలల అనంతరం దీపక్ చాహర్ నేడు జాతీయ జట్టు తరఫున బరిలోకి దిగుతున్నాడు. రాహుల్ త్రిపాఠికి తొలిసారి వన్డే జట్టులోకి పిలుపు రాగా.. వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్‌లకు సైతం సెలక్టర్లు జట్టులో చోటు కల్పించారు. కెఎల్ రాహుల్ స్పోర్ట్స్ హెర్నియా, కోవిడ్-19 నుంచి పూర్తి కోలుకోలేదు. దీంతో జింబాబ్వే సిరీస్‌కు అతడిని పరిగణనలోకి తీసుకోలేదు. శ్రీలంక, వెస్టిండీస్‌లలో సిరీస్ విజయాలు అందించిన శిఖర్ ధావన్ సారథ్యంలోనే భారత్ జింబాబ్వేతో తలపడనుంది. తాజాగా వెస్టిండీస్‌తో సిరీస్‌లో ఆడిన శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, అర్షదీప్ సింగ్, యుజ్వెంద్ర చాహల్‌లకు విశ్రాంతి లభించింది. జింబాబ్వేతో చివరి వన్డే ముగిసిన ఐదు రోజుల్లోనే ఆసియా కప్ ఆరంభం కానుండటంతో కీలక ఆటగాళ్లకు సెలక్టర్లు విశ్రాంతి కల్పించారు.
భారత వన్డే జట్టు : శిఖర్ ధావన్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, శార్దుల్ ఠాకూర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అవేశ్ ఖాన్, ప్రసిద్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, దీపక్ చాహర్.