Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విండీస్‌తో భారత్ రెండో టీ20 నేడు
- రాత్రి 8 నుంచి డిడిస్పోర్ట్స్లో ప్రసారం
బసెటెరె (సెయింట్ కిట్స్, నెవిస్) : నాయకుడిగా రోహిత్ శర్మ, జట్టుగా టీమ్ ఇండియా జోరు కొనసాగుతోంది. కెప్టెన్‌గా వెస్టిండీస్‌పై అజేయ రికార్డుతో దూసుకుపోతున్న రోహిత్ శర్మ.. నేడు మరో విజయంపై కన్నేసి సేనను బరిలోకి దింపుతున్నాడు. వన్డే సిరీస్‌లో భారత్‌కు గట్టి పోటీనిచ్చిన కరీబియన్ల నుంచి పొట్టి ఫార్మాట్లో అంతకుమించిన పోరాటస్ఫూర్తిని ఆశించారు. కానీ అందుకు భిన్నంగా, తొలి టీ20లో వెస్టిండీస్ అన్ని విభాగాల్లోనూ చేతులెత్తేసింది. తొలి టీ20లో ఏకపక్ష విజయం సాధించిన భారత్.. నేడు ఆధిక్యాన్ని 2-0కు పెంచుకోవాలని చూస్తోంది. మరోవైపు కరీబియన్లు పుంజుకుని సిరీస్‌ను సమం చేయాలని ప్రయత్నంలో ఉన్నారు. భారత్, వెస్టిండీస్ రెండో టీ20 నేడు ఆరంభం.
ఆర్డర్‌పై ఫోకస్! : తాజా సిరీస్‌లో భారత్ బ్యాటింగ్ ఆర్డర్‌పై ఫోకస్ చేసినట్టు కనిపిస్తోంది. ఇంగ్లాండ్‌పై టీ20ల్లో రోహిత్‌తో జట్టుకట్టిన రిషబ్ పంత్ ఇన్నింగ్స్‌ను ఆరంభించాడు. కరీబియన్లపై రోహిత్‌తో సూర్యకుమార్ యాదవ్ జోడీ అయ్యాడు. మిడిల్ ఆర్డర్లో రిషబ్ పంత్ కుదురుకునేందుకు ఈ సిరీస్ చక్కని వేదిక కానుంది. మరోవైపు ధనాధన్ హిట్టర్లతో కూడిన బ్యాటింగ్ లైనప్‌లో శ్రేయస్ అయ్యర్ ఉనికి చాటుకోవాల్సిన అవసరం ఏర్పడింది. వన్డేల్లో అదరగొట్టినా.. పొట్టి ఫార్మాట్లో అది లెక్కలోకి రాదు. దీంతో నేడు అతడి నుంచి ఓ విధ్వంసక ఇన్నింగ్స్ ఆశించవచ్చు. లోయర్ ఆర్డర్లో దినేశ్ కార్తీక్‌ను రోహిత్ గొప్పగా వినియోగించుకున్నాడు. హార్దిక్, కార్తీక్ ద్వయం నుంచి మరిన్ని మెరుపులు ఆశించవచ్చు. ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్ల ఫార్ములా నేడు కొనసాగే అవకాశం ఉంది. జడేజా, అశ్విన్, బిష్ణోరు త్రయం స్పిన్ విభాగంలో... భువనేశ్వర్, అర్షదీప్‌లు పేస్ విభాగంలో ఉండనున్నారు.