Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ క్రీడల నిర్వహణ, స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై అధ్యాయనం చేసేందుకు తెలంగాణ నుంచి క్రీడలు, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, భారత హ్యాండ్‌బాల్ సంఘం అధ్యక్షుడు అర్శనపల్లి జగన్ మోహన్‌రావు నేతత్వంలోని త్రిసభ్య బందం ఇంగ్లండ్‌కు పయనమవుతోంది. ఈ బందం మంగళవారం ఉదయం హైదరాబాద్ నుంచి దుబారు మీదగా బర్మింగ్‌హామ్ చేరుకోనుంది. ఈ బందంలో శ్రీనివాస్ గౌడ్, జగన్ మోహన్‌రావుతో పాటు శాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి కూడా ఉన్నారు. ఈ బందం బర్మింగ్‌హామ్ చేరుకున్నాక అక్కడ ఏర్పాట్లను పరిశీలించి, రాష్ట్రంలో క్రీడాభివద్ధి కోసం ఎలాంటి నిర్మాణాత్మక చర్యలు తీసుకుంటే బాగుంటుందో ప్రభుత్వానికి నివేదించనుంది.