Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బర్మింగ్‌హామ్: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు నాల్గోరోజు రజత పతకం ఒక్కటే దక్కింది. సోమవారం జరిగిన జూడో మహిళల విభాగం ఫైనల్లో సుశీలా దేవి పరాజయన్ని చవిచూసింది. దీంతో 27ఏళ్ల మణిపూర్‌కు చెందిన సుశీలా దేవి రెండోసారి కామన్వెల్త్ గేమ్స్‌లో రజత పతకం సాధించింది. అంతకుముందు 2014 కామన్వెల్త్ క్రీడల్లోనూ సుశీలా దేవి ఇదే విభాగంలో రజత పతకం కైవసం చేసుకుంది. ఫైనల్లో దక్షిణాఫ్రికాకు చెందిన మిఛ్ఛెలా వైట్బురుతో పోటీపడ్డా.. టెక్నికల్ సుపీరియారిటీలో పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. అంతకుముందు జరిగిన సెమీస్ పోటీలో మారిషస్‌కు చెందిన ప్రిసిల్లా మోరాండ్పై విజయం సాధించింది. సుశీలా దేవి ఫైనల్లో దక్షిణాఫ్రికాకు చెందిన మిఛ్ఛెలాతో పోటీపడనుంది. సెమీస్‌లో ఇరువురు ప్లేయర్స్ డిఫెన్స్‌కే ప్రాధాన్యత ఇచ్చినా.. చివరి 20సెకన్లలో సుశీలా దేవి ప్రత్యర్ధిని పడేసింది. క్వార్టర్ఫైనల్లోకి సుశీలా దేవి మలావాకు చెందిన హర్రిట్పై గెలుపొందిన విషయం తెలిసిందే. ఇక పురుషుల 60కిలోల విభాగంలో విజరుకుమార్ యాదవ్ కాంస్య పతక పోటీకి అర్హత సాధించాడు. స్కాట్లాండ్కు చెందిన మున్రోతో తలపడనున్నాడు. 28ఏళ్ల యాదవ్ 2018, 2019 కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణ పతకాలను సాధించాడు. క్వార్టర్స్‌లో ఆస్ట్రేలియా ప్లేయర్ చేతిలో ఓడినా.. అతడు ఫైనల్‌కు చేరడంతో కాంస్య పతకానికి విజరు అర్హత సాధించాడు.పురుషుల జుడో కాంస్య పతకానికి విజయ్ కుమార్ పోటీపడనున్నాడు.