Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బర్మింగ్‌హామ్: కామన్వెల్త్ గేమ్స్ లాన్బాల్(4)లో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. సోమవారం జరిగిన సెమీఫైనల్లో న్యూజిలాండ్‌ను ఓడించి తొలిసారి ఫైనల్లోకి ప్రవేశించి పతకం ఖాయం చేసింది. రూపా రాణి, లౌలీ ఛౌబే, పింకీ, నయన్మోనీల కూడిన భారత మహిళల జట్టు 16-13పాయింట్ల తేడాతో న్యూజిలాండ్ బృందంపై విజయం సాధించింది. భారత్ 12-13పాయింట్లతో వెనుకబడి ఉన్న దశలో పింకీ, నయన్మోనీ అద్భుత ప్రదర్శన కనబరిచి వరుసగా 4పాయింట్లు సాధించారు. దీంతో భారత్ నిర్ణీత 15పాయింట్లు సాధించి ఫైనల్లోకి ప్రవేశించింది. దీంతో భారతజట్టు చరిత్రలో తొలిసారి ఈ విభాగంలో ఓ పతకం ఖాయం చేసుకొని రికార్డు నెలకొల్పింది. దక్షిణాఫ్రికాతో ఫైనల్లో తలపడనుంది.
క్వార్టర్స్‌కు అమిత్, హుసాముద్దీన్
బాక్సింగ్ క్వార్టర్ఫైనల్లోకి అమిత్ పంగల్, మహ్మద్ హుసాముద్దీన్ ప్రవేశించారు. పురుషుల 75కిలోల ఫెథర్ వెయిట్ విభాగంలో మహ్మద్ హుసాముద్దీన్ క్వార్టర్ఫైనల్లోకి చేరాడు. సోమవారం జరిగిన ప్రి క్వార్టర్స్‌లో హుసాముద్దీన్ 5-0తో బంగ్లాదేశ్‌కు చెందిన మహ్మద్ సలీమ్‌ను చిత్తుచేశాడు. క్వార్టర్స్‌లో దక్షిణాఫ్రికాకు చెందిన అమ్జోలీ డియోయితో తలపడనున్నాడు. 51కిలోల విభాగం ఫ్లైవెయిట్‌లో అమిత్.. వనౌటుకు చెందిన నమ్రి బెర్రిపై విజయం సాధించాడు. టోక్యో ఒలింపిక్స్‌లో అనూహ్యంగా పతకం చేజార్చుకున్న అమిత్.. పాల్గొనే మేజర్ టోర్నీ ఇదే.
మహిళల ఆర్టిస్టిక్స్ జిమ్నాస్టిక్ వాల్ట్ విభాగంలో ప్రణతి నాయక్ 5వ స్థానంలో నిలిచింది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన 27ఏళ్ల ప్రణతి తొలి వాల్ట్ 12.633పాయింట్లు సాధించిన ప్రణతి.. రెండో ప్రయత్నంలో 11.766పాయింట్లు, మూడోసారి 12.699పాయింట్లను సాధించగల్గింది. దీంతో ఈ విభాగంలో భారత్‌కు పతకం చేజారినట్లే. 2019, 2022 ఆసియా క్రీడల్లో ప్రణతి కాంస్య పతాలను సాధించి కామన్వెల్త్ క్రీడలకు బెర్త్ సంపాదించింది.