Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 17 ఏండ్ల తర్వాత రానున్న ఇంగ్లీష్ జట్టు
కరాచీ : 17 ఏండ్ల సుదీర్ఘ విరామం అనంతరం ఇంగ్లాండ్ జట్టు పాకిస్థాన్ గడ్డపై కాలుమోపనుంది. ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ సన్నద్ధతలో భాగంగా ఇంగ్లాండ్ జట్టు ఏడు టీ20ల సిరీస్ కోసం పాక్ పర్యటనకు వెళ్లనుంది. తొలి నాలుగు టీ20లు కరాచీలో, చివరి మూడు టీ20లు లాహోర్‌లో జరుగనున్నాయి. అక్టోబర్ 2న చివరి టీ20 తర్వాత ఇంగ్లాండ్ జట్టు వరల్డ్‌కప్ కోసం ఆస్ట్రేలియా బయల్దేరనుంది. టీ20 వరల్డ్‌కప్ ముగిసిన అనంతరం మూడు మ్యాచుల టెస్టు సిరీస్ కోసం ఇంగ్లాండ్ జట్టు మరోసారి పాకిస్థాన్‌కు రానుంది. ఈ సీజన్లో న్యూజిలాండ్, వెస్టిండీస్ సైతం పాక్ పర్యటనకు రానున్నట్టు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) వెల్లడించింది.