Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండో టీ20లో విండీస్ గెలుపు
బసెటెరె (సెయింట్ కిట్స్) : కరీబీయన్లు పుంజుకున్నారు. పొట్టి సిరీస్‌ను సమం చేశారు. తొలి మ్యాచ్‌లో దారుణ పరాభవం అనంతరం రెండో టీ20లో వెస్టిండీస్ ఘన విజయం నమోదు చేసింది. అనూహ్య పరిణామాల నడుమ ఆలస్యంగా మొదలైన రెండో టీ20లో విండీస్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. విండీస్ పేసర్ ఒబెడ్ మెక్కారు (6/17) సంచలన బౌలింగ్‌తో నిప్పులు చెరిగాడు. ఆరు వికెట్ల ప్రదర్శనతో భారత్‌ను గట్టి దెబ్బ కొట్టాడు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 19.4 ఓవర్లలో 138 పరుగులకే కుప్పకూలింది. రిషబ్ పంత్ (24), జడేజా (27), హార్దిక్ పాండ్య (31) భారత్‌కు గౌరవప్రద స్కోరు అందించారు. రోహిత్ శర్మ (0), సూర్యకుమార్ (11), శ్రేయస్ అయ్యర్ (10), దినేశ్ కార్తీక్ (7) విఫలమయ్యారు. స్వల్ప లక్ష్యాన్ని వెస్టిండీస్ 19.2 ఓవర్లలో ఛేదించింది. ఓపెనర్ బ్రాండన్ కింగ్ (68, 52 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), డెవాన్ థామస్ (31 నాటౌట్) రాణించారు.
మూడో మ్యాచ్ సైతం ఆలస్యం! : రెండో టీ20 కోసం భారత్, విండీస్ జట్లు బసెటెరాకు సోమవారం చేరుకున్నాయి. కానీ ఇరు జట్ల కిట్లు సమయానికి రాలేదు. దీంతో భారత కాలమానం ప్రకారం 8 గంటలకు ఆరంభం కావాల్సిన మ్యాచ్‌ను 11 గంటలకు మొదలుపెట్టారు. సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్లు అర్షదీప్ సింగ్ జెర్సీతో బరిలోకి దిగారు. రెండో టీ20 ఆలస్యం కావటంతో.. మంగళవారం జరగాల్సిన మూడో టీ20 సమయాన్ని ముందుకు జరిపారు. మూడో టీ20 నేడు 90 నిమిషాలు ఆలస్యంగా (రాత్రి 9.30) ఆరంభం అవుతుంది. ఈ మేరకు ఇరు జట్లు ఓ అంగీకారానికి వచ్చాయి.