Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆసియా కప్ షెడ్యూల్ విడుదల
దుబాయ్ : ప్రపంచ క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పొరుగు దేశాల పోరుకు కౌంట్‌డౌన్ మొదలైంది. సరిహద్దు ఉద్రిక్తతలు, రాజకీయ కారణాల రీత్యా భారత్, పాకిస్థాన్ క్రికెట్ జట్లు ఏండ్లుగా ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడటం లేదు. ఐసీసీ, ఏసీసీ టోర్నీల్లోనే పొరుగు దేశాలు పోటీపడుతున్నాయి. ఈ ఏడాది వరుసగా రెండు మెగా టోర్నీల్లో ముఖాముఖికి సిద్ధమవుతున్న భారత్, పాకిస్థాన్‌లకు.. తొలి సమరం ఖరారైంది. ఆసియా కప్‌లో ఆగస్టు 28న దుబారు వేదికగా ఈ రెండు జట్లు ఢకొీట్టనున్నాయి. 2022 ఆసియా కప్ (టీ20 ఫార్మాట్) షెడ్యూల్ మంగళవారం విడుదల చేశారు. ఆగస్టు 27న శ్రీలంక, అఫ్గనిస్థాన్ మ్యాచ్‌తో ఆసియా కప్ ఆరంభం కానుండగా.. సెప్టెంబర్ 11న టైటిల్ పోరుతో ముగియనుంది. ఆరు జట్లు పోటీపడనున్న ఈ టోర్నీ యుఏఈలో జరుగనుంది. శ్రీలంకలో పరిస్థితుల నేపథ్యంలో వేదికను ఎమిరేట్స్‌కు మార్పు చేశారు. ఆగస్టు 20 నుంచి ఓమన్ వేదికగా అర్హత టోర్నీ ఆరంభం కానుంది. యుఏఈ, కువైట్, సింగపూర్, హాంగ్‌కాంగ్‌లు ప్రధాన టోర్నీలో ఆడేందుకు అమీతుమీ తేల్చుకోనున్నాయి. గ్రూప్-ఏలో భారత్, పాకిస్థాన్ సహా ఓ క్వాలిఫయర్ ఆడనుండగా.. గ్రూప్-బిలో శ్రీలంక, అఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్‌లు తలపడనున్నాయి. ప్రతి గ్రూప్ నుంచి రెండు జట్లు సూపర్ 4 దశకు అర్హత సాధించనున్నాయి. సూపర్ 4 దశలో ప్రతి జట్టు మిగతా మూడు జట్లతో ఓ మ్యాచ్‌లో ఆడనున్నాయి. సూపర్ 4లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు టైటిల్ పోరుకు అర్హత సాధిస్తాయి. ఆసియా కప్‌లో అన్ని మ్యాచులు భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు ఆరంభం అవుతాయి.