Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అండర్-20 అథ్లెటిక్ చాంపియన్‌షిప్స్
కాలి(కొలంబియా) : ప్రపంచ అండర్-20 అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత మిక్స్డ్ రిలే జట్టు 4, 400 విభాగంలో రజత పతకం దక్కించుకుంది. అమెరికాకు గట్టి పోటీనిచ్చిన మనోళ్లు.. సెకనులో .07 తేడాతో పసిడి కోల్పోయారు. భరత్ శ్రీధర్, ప్రియా మోహన్, కపిల్, రూపాల్ చౌదరిలతో కూడిన భారత జట్టు 3.17.76 సెకండ్లలో రేసు పూర్తి చేసింది. ఇది ఆసియా రికార్డు. 3.17.69 సెకండ్లలో రేసు ముగించిన అమెరికా జట్టు స్వర్ణం కైవసం చేసుకోగా, జమైకా 3:19:98 సెకండ్లతో కాంస్యం గెలుచుకుంది. జూనియర్ ప్రపంచ అథ్లెటిక్స్‌లో భారత జట్టుకు వరుసగా ఇది రెండో పతకం. గత చాంపియన్‌షిప్‌లో కాంస్యం సాధించిన భారత రిలే జట్టు ఈసారి సిల్వర్ సొంతం చేసుకుంది. ఇక మహిళల 400 మీటర్ల పరుగులో భారత అథ్లెట్లు రూపాల్, ప్రియ సెమీఫైనల్స్‌కు చేరుకున్నారు.