Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్
దుబాయ్ : సూర్యకుమార్ యాదవ్ కెరీర్ అత్యుత్తమ ర్యాంక్ సాధించాడు. టీ20ల్లో ఆడిన 20 ఇన్నింగ్స్‌ల్లోనే వరల్డ్ నం.2 బ్యాటర్‌గా నిలిచాడు. ఇంగ్లాండ్‌పై అజేయ శతకంతో ఏకంగా 44 స్థానాలు ఎగబాకి టాప్-5లోకి దూసుకొచ్చిన సూర్యకుమార్.. తాజాగా మూడో టీ20లో విండీస్‌పై విధ్వంసక ఇన్నింగ్స్‌తో రెండో స్థానానికి చేరుకున్నాడు. వరల్డ్ నం.1 బ్యాటర్ బాబర్ ఆజామ్‌కు రెండు పాయింట్ల వెనుకంజలోనే నిలిచాడు. విండీస్‌పై చివరి రెండు టీ20ల్లో మెరిస్తే అతి తక్కువ కాలంలో వరల్డ్ నం.1గా నిలిచిన బ్యాటర్‌గా సూర్య రికార్డు నెలకొల్పన్నాడు. మహ్మద్ రిజ్వాన్, ఎడెన్ మార్కరం, డెవిడ్ మలాన్‌లు సూర్య తర్వాతి స్థానంలో కొనసాగుతున్నారు.
సూర్య షో : సూర్యకుమార్ యాదవ్ (76, 44 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్‌లు) విరుచుకుపడ్డాడు. 165 పరుగుల ఛేదనలో సూర్యకు తోడు రిషబ్ పంత్ (33 నాటౌట్, 26 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) మెరవటంతో 19 ఓవర్లలోనే భారత్ లాంఛనం ముగించింది. ఏడు వికెట్ల తేడాతో గెలుపొంది టీ20 సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో నిలిచింది. కైల్ మేయర్స్ (73) అర్థ సెంచరీతో తొలుత వెస్టిండీస్ 164/5 పరుగులు చేసింది. నాల్గో టీ20 శనివారం లాడర్‌హిల్ (ఫ్లోరిడా)లో జరుగనుంది.