Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆసీస్, సఫారీలతో సిరీస్ షెడ్యూల్ విడుదల
హైదరాబాద్ : సుదీర్ఘ విరామం అనంతరం అంతర్జాతీయ క్రికెట్‌కు హైదరాబాద్ వేదిక కానుంది. సెప్టెంబర్ 25న భారత్, ఆస్ట్రేలియా చివరి టీ20 పోరుకు ఉప్పల్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మేరకు బుధవారం బీసీసీఐ షెడ్యూల్ విడుదల చేసింది. సెప్టెంబర్ 20న తొలి టీ20 మొహాలిలో, రెండో టీ20 నాగ్‌పూర్‌లో జరుగనున్నాయి. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు తిరువనంతపురం, గువహటి, ఇండోర్లు వేదిక కానున్నాయి. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆక్టోబర్ 2న భారత్, దక్షిణాఫ్రికా గువహటిలో పొట్టి పోరులో తలపడనున్నాయి. సఫారీతో వన్డే సిరీస్‌కు లక్నో, రాంచీ, ఢిల్లీలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి.