Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అండర్-20 అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్
కాలి (కొలంబియా) : అండర్-20 అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌లో భారత యువ అథ్లెట్ చరిత్ర సృష్టించింది. ఈ ఈవెంట్లో ఒకేసారి రెండు పతకాలు సాధించిన భారత క్రీడాకారిణిగా రికార్డు నెలకొల్పింది. 400 (4) మీటర్ల మిక్స్డ్ రిలే పరుగులో రజత పతకం సాధించిన భారత జట్టులో ఉన్న రూపాల్ చౌదరి.. వ్యక్తిగత విభాగంలో దుమ్మురేపింది. మహిళల 400 మీటర్ల పరుగు పందెంలో రూపాల్ చౌదరి కాంస్య పతకం సాధించింది. 51.85 సెకండ్లలో రేసును పూర్తి చేసిన రూపాల్ చౌదరి మూడో స్థానంలో నిలిచింది. 51.50 సెకండ్లలో రేసు ముగించిన యమి మేరి జాన్ (గ్రేట్ బ్రిటన్) స్వర్ణం సాధించగా.. కెన్యా అథ్లెట్ డనేరియస్ మతుంగ 51.71 సెకండ్ల ప్రదర్శనతో సిల్వర్ మెడల్ సొంతం చేసుకుంది.