Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫైనల్లో హర్మన్‌ప్రీత్ సేన
- సెమీస్‌లో ఇంగ్లాండ్‌పై గెలుపు
బర్మింగ్‌హామ్ : కామన్వెల్త్ క్రీడల క్రికెట్లో భారత జట్టు పసిడి వేటకు సిద్ధమైంది. శనివారం ఆతిథ్య ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీఫైనల్లో టీమ్ ఇండియా మెరుపు విజయం నమోదు చేసింది. 18 బంతుల్లో 30 పరుగులు చేయాల్సిన తరుణంలో మ్యాచ్ పూర్తిగా ఇంగ్లాండ్ వైపు ఉంది. చేతిలో మరో ఏడు వికెట్లు ఉండటంతో ఇంగ్లాండ్ విజయం లాంఛనమే అనిపించింది. కానీ డెత్ ఓవర్లలో స్నేV్‌ా రానా అద్వితీయ బౌలింగ్ ప్రదర్శన భారత్‌ను కామన్వెల్త్ క్రీడల ఫైనల్లోకి తీసుకెళ్లింది. 165 పరుగుల ఛేదనలో ఇంగ్లాండ్‌ను 160 పరుగులకే పరిమితం చేసిన భారత్ 4 పరుగుల తేడాతో మెరుపు విజయం సాధించింది.
మంధాన మెరుపుల్ : తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 164 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ స్మతీ మంధాన (61, 32 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) 23 బంతుల్లోనే అర్థ సెంచరీ బాదేసింది. మంధాన జోరుతో భారత్ భారీ స్కోరు దిశగా సాగింది. షెఫాలీ వర్మ (15) నిరాశపరిచినా.. జెమీమా రొడ్రిగస్ (44 నాటౌట్, 31 బంతుల్లో 7 ఫోర్లు చెలరేగింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (20), దీప్తి శర్మ (22)లు సైతం రాణించారు.
ఇంగ్లాండ్ ఆటకట్టు! : 165 పరుగుల లక్ష్యం ఇంగ్లాండ్ పెద్ద సమస్య కాదు. ఓపెనర్లు సోఫియా (19), డానీ వ్యాట్ (35) ధనాధన్ జోరు చూపించారు. స్వింగ్‌స్టర్ రేణుక పవర్‌ప్లేలో ప్రభావం చూపలేదు. దీంతో స్పిన్నర్లను బరిలోకి దింపి ఇంగ్లాండ్ జోరు అడ్డుకట్ట వేయాల్సి వచ్చింది. నటాలీ సీవర్ (41), అమీ జోన్స్ (31) క్రీజులో ఉండగా ఇంగ్లాండ్ విజయంపై దీమాగా కనిపించింది. కానీ డెత్ ఓవర్లలో వరుస వికెట్లు కూల్చిన భారత్ మ్యాచ్‌ను మలుపుతిప్పింది. చివరి ఆరు బంతుల్లో 14 పరుగులు అవసరం కాగా.. గొప్పగా బౌలింగ్ చేసిన స్నేV్‌ా రానా తొలి ఐదు బంతులకు 4 పరుగులే ఇచ్చింది. చివరి బంతికి సిక్సర్ బాదినా.. ఇంగ్లాండ్ సెమీస్‌కు చేరలేకపోయింది. తొలిసారి కామన్వెల్త్ క్రీడల్లో భారత్ ఫైనల్లోకి ప్రవేశించి, కనీసం రజత పతకం ఖాయం చేసుకుంది.