Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్లోబల్ టీ20కి ఎన్ఓసీ నిరాకరణ
కోల్కత : ఈ ఏడాది సెప్టెంబర్లో జరుగనున్న నమీబియా గ్లోబల్ టీ20 టోర్నీలో పాల్గొనేందుకు రంగం సిద్ధం చేసుకున్న బెంగాల్ రాష్ట్ర క్రికెట్ సంఘానికి చుక్కెదురైంది. గ్లోబల్ టీ20 టోర్నీలో ప్రాతినిథ్యం వహించేందుకు అవసరమైన నిరభ్యంతర పత్రాన్ని మంజూరు చేసేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిరాకరించింది. ఈ టోర్నీల్లో పాల్గొనేందుకు అభిమన్యు ఈశ్వరన్ కెప్టెన్సీలో జట్టును ఇప్పటికే బెంగాల్ ఎంపిక చేసింది. బీసీసీఐ విధానం ప్రకారం, గ్లోబల్ టీ20ల్లో పోటీపడేందుకు భారత క్రికెటర్లకు అనుమతి ఇవ్వటం లేదు. దీంతో క్యాబ్ చేసిన ప్రతిపాదనను బోర్డు తోసిపుచ్చింది. దీంతో టోర్నీలో ఆడటం లేదనే విషయాన్ని క్యాబ్ అధికారులు నిర్వాహకులకు తెలియజేశారు. నమీబియా జాతీయ జట్టు సహా పీసీఎల్ ప్రాంఛైజీ, దక్షిణాఫ్రికా దేశవాళీ క్రికెట్ జట్టు ప్రస్తుతం ఈ లీగ్లో ఆడేందుకు అంగీకారం తెలిపాయి.
2022 బర్మింగ్హామ్ కామన్వెల్త్ క్రీడల్లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన క్రీడాకారులు అద్భుత ప్రదర్శన చేసి ఆరు పతకాలు సాధించటం పట్ల సిఎం కెసిఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, శాట్స్ చైర్మెన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డిని సిఎం కెసిఆర్ అభినందించారు.