Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : టి20 క్రికెట్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ఒక కొత్త శకాన్ని సృష్టించింది. క్యాష్‌రిచ్ లీగ్‌గా పేరున్న ఐపీఎల్ దారిలోనే అనేక కొత్త లీగ్‌లు పుట్టుకొచ్చాయి. ఎన్ని వచ్చినా ఐపీఎల్‌ను మాత్రం అందుకోలేకపోయాయి. ఇప్పటికే 15 సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఐపీఎల్ వచ్చే ఏడాది 16వ వసంతంలోకి అడుగుపెట్టనుంది. ఇప్పటిదాకా పురుషుల క్రికెట్లోనే ఉన్న ఐపీఎల్‌ను బీసీసీఐ మహిళలకు ప్రవేశపెట్టనుంది. వచ్చే ఏడాది ఉమెన్స్ ఐపీఎల్‌ను ప్రారంభించేందుకు ఇప్పటికే గ్రౌండ్ వర్క్ పూర్తయింది. తాజాగా బీసీసీఐ దానికి తుది రూపునిచ్చే పనిని చేపట్టింది. పురుషుల ఐపీఎల్ సీజన్ (మార్చి చివర్లో) కంటే ముందే ఉమెన్స్ ఐపీఎల్‌ను ఆడించాలని భావిస్తున్నది. ఆరు ఫ్రాంచైజీలతో ఈ లీగ్ ను నిర్వహించేందుకు బీసీసీఐ సన్నాహాలు చేస్తున్నది. ఐపీఎల్ లో ఇప్పటికే ఫ్రాంచైజీ ఓనర్లుగా ఉన్న పలువురు బడా కార్పొరేట్లే ఉమెన్స్ ఐపీఎల్ లో కూడా ఫ్రాంచైజీలను కొనుగోలు చేయడానికి ఆసక్తిగా ఉన్నారని తెలుస్తున్నది.