Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరల్డ్ లెజెండ్స్‌తో ఫ్రెండ్లీ మ్యాచ్
ముంబయి: స్వాతంత్య్రం వచ్చి 75ఏళ్లయిన సందర్భాన్ని పురస్కరించుకొని ఒక క్రికెట్ మ్యాచ్‌ను నిర్వహించేదుకు బిసిసిఐ ప్రణాళికలు సిద్ధం చేసింది. కోల్‌కత్తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా సెప్టెంబర్ 16న ఇండియా మహరాజాస్ × వరల్డ్ గెయింట్స్ ఈ మ్యాచ్ జరగనుంది. టీమిండియా మాజీ కోచ్, కమిషనర్ ఆఫ్ లెజెండ్జ్ లీగ్ క్రికెట్(ఎల్ఎల్సి) సభ్యుడు రవిశాస్త్రి శుక్రవారం ఈ విషయాన్ని తెలియజేశారు. 75ఏళ్ల స్వాతంత్య్ర సంబరాల్లో భాగంగా ఓ మ్యాచ్‌ను నిర్వహించ తలపెట్టాం. 2015లో జరిగిన తొలి లెజెండ్స్ టోర్నమెంట్లో సచిన్ టెండ్కూలర్, షేన్‌వార్న్ సారథ్యం వహించారు. ఆ తర్వాత కొన్ని లెజెండ్స్ ఫ్రెండ్లీ మ్యాచ్‌లు జరిగాయి. ఈసారి అలా కాకుండా ఏకైక మ్యాచ్‌ను నిర్వహించతలపెట్టాం' అని రవిశాస్త్రి చెప్పుకొచ్చారు.
జట్లు..
ఇండియా మహరాజాస్: గంగూలీ(కెప్టెన్), సెహ్వాగ్, కైఫ్, యూసుఫ్, ఇర్ఫాన్ పఠాన్, బద్రీనాథ్, నమన్ ఓఝా, పార్థీవ్ పటేల్(వికెట్ కీపర్లు), స్టువర్ట్ బిన్నీ, శ్రీశాంత్, హర్భజన్ సింగ్, ధిండా, ప్రగ్యాన్ ఓఝా, జడేజా, ఆర్పీ సింగ్, జోగిందర్ శర్మ, రితెందర్ సింగ్ సోథీ.
వరల్డ్ లెజెండ్స్: మోర్గాన్, సిమ్మన్స్, గిబ్స్, కల్లీస్, జయసూరియ, ప్రియర్, రామ్‌దిన్(వికెట్ కీపర్లు), మెక్ కల్లామ్, రోడ్స్, మురళీధరన్, స్టెయిన్, మసకడ్జా, మొర్తజా, అస్గర్ ఆప్ఘాన్, జాన్సన్, బ్రెట్ లీ, ఓబ్రెయిన్.