Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నవంబర్ 20నుంచి మెగా టోర్నీ ప్రారంభం
దోహా: కతార్ వేదికగా జరిగే ఫిఫా ప్రపంచకప్ రీ షెడ్యూల్ విడుదలైంది. నవంబర్ 20న కతార్-ఈక్వెడార్ల మధ్య జరిగే తొలి మ్యాచ్‌తో మెగా సగ్రామం ప్రారంభం కానుంది. తొలుత నవంబర్ 21న తొలి మ్యాచ్ జరగనున్నట్లు ప్రకటించినా.. తాజాగా ఒక రోజు ముందే ప్రారంభోత్సవ వేడుకలు, అనంతరం ఆతిథ్య కతార్-ఈక్వెడార్ల తొలి మ్యాచ్‌తో మెగా సంగ్రామం ప్రారంభం కానున్నట్లు ఫిఫా నిర్వాహకులు ప్రకటించారు. ఆ మ్యాచ్ రాత్రి 7 గంటలకు జరగనున్నట్లు పేర్కొన్నారు. నవంబర్ 21నుంచి ప్రతిరోజు మూడు మ్యాచ్‌లు జరగనున్నాయని, మధ్యాహ్నం ఒంటిగంట, రాత్రి 7 గంటలు, 10గంటలకు వేర్వేరు వేదికల్లో మ్యాచ్‌లు జరగనున్నట్లు తెలిపారు. మొత్తం 8 మైదానాల్లో మెగా టోర్నీ జరగనుందని, తాజాగా నెదర్లాండ్స్, సెనెగల్ ఫిఫా ప్రపంచకప్‌కు అర్హత సాధించడంతో ఫిఫా తాజా షెడ్యూల్‌ను విడుదల చేసింది. డిసెంబర్ 3నుంచి ప్రి క్వార్టర్స్, 8నుంచి క్వార్టర్‌ఫైనల్స్, 13, 14న సెమీఫైనల్ పోటీలు జరగనున్నాయి. ఇక ఫైనల్ మ్యాచ్ 18న జరగనుండగా.. 3వ స్థానంకోసం పోటీ 17నే జరగనుంది. ఇక 2006 ఫిఫా ప్రపంచకప్‌కు ఆతిథ్యమిచ్చిన జర్మనీ జట్టు తొలి మ్యాచ్‌ను కోస్టారికాతో తలపడగా.. దక్షిణాఫ్రికా-మెక్సికో (2010), బ్రెజిల్-కోస్టారికా(2014), రష్యా-సౌదీ అరేబియా(2018) మ్యాచ్‌లతో ఫిఫా మెగా సంగ్రామం ప్రారభమయ్యాయి.
గ్రూప్-ఏ: కతార్, ఈక్వెడార్, సెనెగల్, నెదర్లాండ్స్
గ్రూప్-బి: ఇంగ్లండ్, ఇరాన్, అమెరికా, వేల్స్
గ్రూప్-సి: అర్జెంటీనా, సౌదీ అరేబియా, మెక్సికో, పోలండ్
గ్రూప్-డి: ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, డెన్మార్క్, ట్యునీషియా
గ్రూప్-ఇ: స్పెయిన్, కోస్టారికా, జర్మనీ, జపాన్
గ్రూప్-ఎఫ్: బెల్జియం, కెనడా, మొరాకో, క్రొయేషియా
గ్రూప్-జి: బ్రెజిల్, సెర్బియా, స్విట్జర్లాండ్, కెమరూన్
గ్రూప్-హెచ్: పోర్చుగల్, ఘనా, ఉరుగ్వే, కొరియా రిపబ్లిక్