Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జింబాబ్వే పర్యటనకు దూరం?
ముంబయి : భారత యువ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ మళ్లీ గాయం బారిన పడ్డాడు. ఇంగ్లీష్ కౌంటీల్లో లాంకషైర్ తరఫున ఆడుతున్న వాషింగ్టన్ సుందర్ రాయల్ లండన్ కప్ మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు. దీంతో సుందర్ ఎడమ చేతి భుజం దెబ్బతింది. మాంచెస్టర్‌లో సుందర్‌కు వైద్య పరీక్షలు నిర్వహించారు. వాషింగ్టన్ సుందర్ ఇప్పటికి భుజం నొప్పితో కొంత అసౌకర్యానికి లోనవుతున్నాడు. ఆ తర్వాత జరిగిన మ్యాచుల్లో సైతం సుందర్ బరిలోకి దిగలేదు. మరో వారంలో ఆరంభం కానున్న జింబాబ్వేతో వన్డే సిరీస్‌కు భారత జట్టులో వాషింగ్టన్ సుందర్ చోటు దక్కించుకున్నాడు. గాయం నుంచి కోలుకుని విరామం అనంతరం జాతీయ జట్టులోకి వచ్చిన వాషింగ్టన్ సుందర్.. మళ్లీ గాయంతో జట్టుకు దూరమయ్యే ప్రమాదంలో పడ్డాడు. వాషింగ్టన్ సుందర్ గాయం తీవ్రతపై బీసీసీఐ వైద్య బృందం నివేదికలు తెప్పించుకుని పరిశీలిస్తోంది. గాయం తీవ్రత, విరామ సమయం దృష్టిలో ఉంచుకుని జింబాబ్వే పర్యటనకు వాషింగ్టన్ సుందర్‌ను పంపించాలా? వద్దా? అనే విషయంలో ఓ నిర్ణయానికి రానున్నారు. జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్ చీఫ్ కోచ్‌గా భారత జట్టు జింబాబ్వే పర్యటనకు బయల్దేరిన సంగతి తెలిసిందే. ఆగస్టు 20న భారత్, జింబాబ్వే తొలి వన్డేలో తలపడనున్నాయి.