Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పుణె : అల్టిమేట్ ఖోఖో లీగ్‌లో తెలుగు యోధాస్ జోరు కొనసాగుతోంది. తొలి మ్యాచ్‌లో అదిరే ప్రదర్శన చేసిన తెలుగు యోధాస్.. తాజాగా రెండో మ్యాచ్‌లోనూ తిరుగులేదని నిరూపించింది. మంగళవారం పుణెలో రాజస్థాన్ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తెలుగు జట్టు 21 పాయింట్ల భారీ తేడాతో గెలుపొందింది. తెలుగు యోధాస్ 68 పాయింట్లు సాధించగా, రాజస్థాన్ వారియర్స్ 47 పాయింట్లు మాత్రమే సాధించింది. ఎటాకింగ్, డైవింగ్, స్కై డైవ్స్, పోల్ డైవ్స్లో అదరగొట్టిన తెలుగు యోధాస్.. టచ్ పాయింట్లు, డైవ్ పాయింట్లలో దూసుకెళ్లింది. మ్యాచ్‌లో ఎక్కడా ప్రత్యర్థికి అవకాశం ఇవ్వని తెలుగు యోధాస్ 21 పాయింట్ల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. సీజన్లో రెండు మ్యాచుల్లోనూ గెలుపొందిన తెలుగు యోధాస్.. నేడు చెన్నై క్విక్గన్స్తో పోటీపడనుంది.