Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 46-52తో చెన్నై చేతిలో పరాజయం
- అల్టిమేట్ ఖోఖో లీగ్ సీజన్ 1
పుణె : అల్టిమేట్ ఖోఖో లీగ్ తొలి సీజన్లో వరుసగా రెండు మ్యాచుల్లో ఎదురులేని విజయాలు నమోదు చేసిన తెలుగు యోధాస్.. హ్యాట్రిక్ ముందు తడబాటుకు లోనైంది. పుణెలో బుధవారం చెన్నై క్విక్గన్స్తో జరిగిన మ్యాచ్‌లో తెలుగు యోధాస్ పోరాడి ఓడింది. ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో తెలుగు యోధాస్ ఏడు పాయింట్ల స్వల్ప తేడాతో పరాజయం పాలైంది. తెలుగు యోధాస్ 46 పాయింట్లు సాధించగా.. చెన్నై క్విక్‌గన్స్ 52 పాయింట్లు సొంతం చేసుకుంది. ఎటాకింగ్‌లో, డిఫెన్స్‌లో తెలుగు యోధాస్‌పై స్వల్పంగా ఆధికత్య సాధించిన చెన్నై క్విక్‌గన్స్.. సీజన్లో తెలుగు జట్టుకు తొలి ఓటమి రుచి చూపించింది. తెలుగు యోధాస్ తన తర్వాతి మ్యాచ్‌లో రాజస్థాన్ వారియర్స్‌ను ఆదివారం జరిగే పోరులో ఢకొీట్టనుంది. బుధవారం జరిగిన మరో మ్యాచ్‌లో ముంబయి కిలాడీస్పై గుజరాత్ జెయింట్స్ 66-48తో గెలుపొందింది.