Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తొలి వన్డేలో జింబాబ్వేపై 10వికెట్ల తేడాతో గెలుపు
హరారే: జింబాబ్వేతో గురువారం జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. జింబాబ్వే నిర్దేశించిన 190 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా ఓపెనర్లే ఛేదించారు. తొలుత టాస్ గెలిచిన కెప్టెన్ కేఎల్ రాహుల్ బౌలింగ్ ఎంచుకొన్నాడు. దీంతో బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వేను దీపక్ చాహర్(3/27) మెరుపు బౌలింగ్‌తో టాప్ ఆర్డర్‌ను కూల్చాడు. ఆ తర్వాత ప్రసిధ్(3/50), అక్షర్(3/24) కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో జింబాబ్వే జట్టు 40.3ఓవర్లలో 189పరుగులకే కుప్పకూలింది. జింబాబ్వే కెప్టెన్ చకబ్వా(35), ఎవాన్స్(33) టాప్ స్కోరర్స్. ప్రారంభంలో మైదానంలో తేమను టీమిండియా పేస్ బౌలర్లు తమకు అనుకూలంగా మార్చుకోవడంతో జింబాబ్వే టాప్ ఆర్డర్ ఇబ్బందుల్లో చిక్కుకుంది. చాహార్ సహా ఇతర బౌలర్లు కేవలం 31 పరుగులకే 4 వికెట్లు తీశారు. అటుపై 110/8 స్కోర్ తర్వాత తొమ్మిదో వికెట్ కోల్పోకుండా బ్రాడ్ ఎవాన్స్, రిచర్డ్ నగరవా నిలకడగా ఆడారు. తొమ్మిదో వికెట్ భాగస్వామ్యానికి 65 పరుగులు చేయడంతో జింబాబ్వే గౌరవప్రదమైన స్కోర్ చేరుకోగలిగింది. తర్వాత ప్రసిద్ కృష్ణ బౌలింగ్‌లో రిచర్డ్ నగరవా క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. దీంతో జింబాబ్వే ఇన్నింగ్స్ 189పరుగుల వద్ద ముగిసింది. ఛేదనలో టీమిండియా ఓపెనర్లు ధావన్, శుభ్‌మన్ ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడారు. తొలి 10ఓవర్లలో భారత్ 43 పరుగులు చేసింది. ఆ తర్వాత ధావన్, శుభ్‌మన్ అర్ధసెంచరీలను పూర్తి చేసుకొన్నారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దీపక్ చాహర్‌కు లభించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యతలో ఉండగా.. రెండో వన్డే 20న జరగనుంది.
అదరగొట్టిన జింబాబ్వే టెయిలండర్లు..
జింబాబ్వే టెయిలండర్లు రిచర్డ్ నగరవా(34), బ్రాడ్ ఎవన్స్(33) తొమ్మిదో వికెట్‌కు ఏకంగా 70 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని జతచేశారు. తద్వారా టీమిండియాపై వీరిద్దరూ సరికొత్త రికార్డును నమోదు చేశారు. వన్డేల్లో భారత్‌పై తొమ్మిదో వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం రికార్డును వీరు సాధించారు. ఒక దశలో జింబాబ్వే స్కోర్ 150 పరుగుల మార్క్‌ను దాటడం కష్టమనుకున్న సమయంలో వీరిద్దరూ రాణించడంతో ఆ జట్టు ఏకంగా 189పరుగుల గౌరవప్రద స్కోర్ చేయగల్గింది.
స్కోర్‌బోర్డు..
జింబాబ్వే ఇన్నింగ్స్: ఇన్నోసెంట్ కాలా (సి)సంజు (బి)చాహర్ 4, మరుమాని (సి)సంజు (బి)చాహర్ 8, మధెవెరె (ఎల్బి)చాహర్ 5, విలియమ్స్ (సి)ధావన్ (బి)సిరాజ్ 1, రాజా (సి)ధావన్ (బి)ప్రసిధ్ 12, చకబ్వా (బి)అక్షర్ 35, రియాన్ బర్ల్ (సి)శుభ్‌మన్ (బి)ప్రసిధ్ 11, జోంగ్వే (ఎల్బి)అక్షర్ 13, ఎవాన్స్ (నాటౌట్) 33, నరవా (బి)ప్రసిధ్ 34, న్యూచీ (సి)శుభ్‌మన్ (బి)అక్షర్ 8, అదనం 25, (40.3ఓవర్లలో ఆలౌట్) 189పరుగులు.
వికెట్ల పతనం: 1/25, 2/26, 3/31, 4/31, 5/66, 6/83, 7/107, 8/110, 9/180, 10/189
బౌలింగ్: దీపక్ చాహర్ 7-0-27-3, సిరాజ్ 8-2-36-1, కుల్దీప్ 10-1-36-0, ప్రసిధ్ 8-0-50-3, అక్షర్ 7.3-2-24-3.
ఇండియా ఇన్నింగ్స్: ధావన్ (నాటౌట్) 81, శుభ్‌మన్ (నాటౌట్) 82, అదనం 29. (30.5ఓవర్లలో) 192పరుగులు.
బౌలింగ్: నరవా 7-0-40-0, న్యూచీ 4-0-17-0, ఎవాన్స్ 3.5-0-28-0, విలియమ్స్ 5-0-28-0, రాజా 6-0-32-0, జోంగ్వే 2-0-11-0, మధ్వెరా 2-0-16-0, రియాన్ బర్ల్ 1-0-12-0