Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడనున్న హైదరాబాద్ పేసర్
లండన్: టీమిండియా పేసర్, హైదరాబాద్‌కు చెందిన మహ్మద్ సిరాజ్ తొలిసారి ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడను న్నాడు. కౌంటీ ఛాంపియన్షిప్-2022 సీజన్‌లోని చివరి మూడు మ్యాచ్‌లకు వార్విక్షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ సిరాజ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విషయాన్ని వార్విక్షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ గురువారం మీడియాకు వెల్లడించింది. ''కౌంటీ ఛాంపియన్షిప్ సీజన్‌లోని అఖరి మూడు మ్యాచ్‌లకు భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌తో ఒప్పందం చేసుకున్నాము. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా సెప్టెంబర్ 12న సోమర్‌సెట్‌తో మ్యాచ్‌కు సిరాజ్ జట్టుతో కలవనున్నాడు'' అని పేర్కొంది. ఈ విషయమై సిరాజ్.. ''కౌంటీ క్రికెట్లో ఆడేందుకు ఆనుమతి ఇచ్చిన బిసిసిఐకు కృతజ్ఞతలు తెలపాలి అనుకుంటున్నాను. వార్విక్షైర్ వంటి ప్రతిష్టాత్మక క్లబ్లో ఆడేందుకు అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. ఇంగ్లండ్‌లో ఆడడాన్ని నేను ఎప్పుడూ ఆస్వాదిస్తాను. వార్విక్షైర్ జట్టులో చేరేందుకు చేరేందుకు ఆతృతగా ఎదురు చూస్తున్నాను'' అని సిరాజ్ పేర్కొన్నాడు.