Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దక్షిణాఫ్రికా చేతిలో ఇన్నింగ్స్ 12పరుగుల తేడాతో ఓటమి
లండన్: మూడు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి టెస్ట్‌లో ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు ఘోర పరాజయాన్ని చవిచూసింది. దక్షిణాఫ్రికా చేతిలో ఇంగ్లండ్ జట్టు ఇన్నింగ్స్ 12 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఓవర్ నైట్ స్కోర్ 7 వికెట్ల నష్టానికి 289పరుగులతో శుక్రవారం తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన దక్షిణాఫ్రికా జట్టు 326పరుగులకు ఆలౌటైంది. జేసన్(48), మహరాజ్(41), నోర్ట్జే(28) రాణించారు. బ్రాడ్, స్టోక్స్‌కు మూడేసి, పోల్స్‌కు రెండు వికెట్లు దక్కాయి. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ జట్టు సఫారీ బౌలర్ల దెబ్బకు 149పరుగులకే కుప్పకూలింది. లీస్(35), బ్రాడ్(35), స్టోక్స్(20) బ్యాటింగ్‌లో రాణించారు. నోర్ట్జేకు మూడు, జాసన్, మహరాజ్, రబడాకు రెండేసి వికెట్లు దక్కాయి. దీంతో మూడు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో దక్షిణాఫ్రికా జట్టు 1-0 ఆధిక్యతలో నిలిచింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ... కు లభించగా.. రెండో టెస్ట్ 25నుంచి మాంచెస్టర్ వేదికగా ప్రారంభం కానుంది.