Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎఐఎఫ్ఎఫ్ ఎన్నికలు
కోల్కతా: ఆలిండియా ఫుట్బాల్ ఫెడరేషన్(ఎఐఎఫ్ఎఫ్) అధ్యక్ష పదవికి మాజీ ఫుట్బాల్ ఆటగాడు, కెప్టెన్ బైచుంగ్ భుటియా దరఖాస్తు చేశాడు. ఎఐఎఫ్ఎఫ్లో సభ్యులకంటే బయటివారి ప్రమేయం ఎక్కువ కావడం, ఫిఫా ఎఐఎఫ్ఎఫ్ సభ్యత్వాన్ని రద్దుచేయడంతో సుప్రీంకోర్టు ఎఐఎఫ్ఎఫ్ ప్రక్రియను త్వరగా సరిదిద్దాలని కోరింది. అధ్యక్ష పదవికి ఇప్పటివరకు ఏడు దరఖాస్తులు దాఖలయ్యాయి. వీరిలో కళ్యాణ్ చౌబే, మన్విందర్ సింగ్, షాజీ ప్రభాకర్, ఎన్ఏ హారిస్, యుజెనెసన్ లింగ్డో, వలంకా అలెమావో ఉన్నారు. సుప్రీం కోర్టు కొత్తగా నియమించిన సిఓఏద్వారా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియను ప్రారంభించింది. బైచుంగ్ భుటియాకు ఇతర సమాఖ్యల, మాజీ ఆటగాళ్ల మద్దతు ఉంది. తాజాగా భుటియా అధ్యక్ష పదవికి దరఖాస్తు చేసుకోవడంతో అతను ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశమూ లేకపోలేదు.