Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెంగళూరు: జాతీయ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ పోటీల్లో సుమీత్, యోగేశ్ ప్రపంచ రికార్డులను నమోదు చేశారు. జావెలిన్ త్రో ఎఫ్-64 విభాగంలో సుమిత్ అంటిల్, డిస్కస్ త్రో ఎఫ్-56 విభాగంలో యోగేశ్ కథూనియా ఈ రికార్డులను బ్రేక్ చేశారు. సుమిత్ అంటిల్ ఎఫ్-64 జావెలిన్ త్రో విభాగంలో మూడో ప్రయత్నంలో 68.62మీటర్లు బల్లెం విసిరి ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. అంతకుముందు ఈ రికార్డు సుమిత్ పేర 68.55మీ.గా ఉంది. ఆ రికార్డును టోక్యో ఒలింపిక్స్‌లో నమోదు చేసి సుమిత్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఇక డిస్కస్ ట్రో ఎఫ్-56 విభాగంలో యోగేశ్ కథూనియా ఐదో ప్రయత్నంలో గుండును 48.34మీ. విసిరి రికార్డును నమోదు చేశాడు. టోక్యో పారాలింపిక్స్‌లో యోగేశ్ రజత పతకం కైవసం చేసుకున్నాడు. ఈ పోటీలు నేడూ కొనసాగనున్నాయి.