Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జులన్ గోస్వామికి పిలుపు
- ఇంగ్లండ్ పర్యటనకు మహిళలజట్టును ప్రకటించిన బిసిసిఐ
ముంబయి: ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే భారత మహిళల జట్టును బిసిసిఐ శుక్రవారం ప్రకటించింది. వన్డే, టి20 సిరీస్‌లు ఆడేందుకు ఇంగ్లండ్ వెళ్లే టి20జట్టులో విధ్వంస బ్యాటర్ కిరణ్ నవ్గైర్కు అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేయనుంది. ఇక వెటరన్ పేసర్ జులన్ గోస్వామికి వన్డేల్లో చోటు దక్కింది. అరుణాచల్‌ప్రదేశ్‌కు చెందిన నవ్‌గైర్ మహిళల టి20 ఛాలెంజ్‌లో 76బంతుల్లోనే 162పరుగులు చేసి రికార్డు నెలకొల్పింది. టి20 చరిత్రలో 150కు పైగా పరుగులు కొట్టిన తొలి భారత క్రికెటర్‌గా కిరణ్ నవ్‌గైర్ రికార్డు నెలకొల్పి అందరి దృష్టినీ ఆకర్షించింది. ఇక జులన్ గోస్వామి దీర్ఘకాల విరామం అనంతరం వన్డేల్లో చోటు దక్కించుకుంది. ఈ ఏడాది జరిగిన మహిళల వన్డే ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌తో మార్చి 22న జరిగిన మ్యాచ్ తర్వాత జులన్ మరో మ్యాచ్ ఆడలేదు. ఇక భారతజట్టు కామన్వెల్త్ క్రీడల సెమీఫైనల్లో ఇంగ్లండ్‌ను ఓడించిన సంగతి తెలిసిందే.
టి20 జట్టు : హర్మన్ ప్రీత్ కౌర్(కెప్టెన్), స్మృ తి మంధాన(వైస్ కెప్టెన్), షెఫాలీ వర్మ, దీప్తి శర్మ, పూజ వస్త్రాకర్, జెమీమా రోడ్రిగ్స్, స్నేV్‌ా రాణా, రేణుక ఠాకూర్, మేఘ్న సింగ్, రాధా యాదవ్, ఎస్. మేఘ్న, రిచా ఘోష్, తానియా భాటియా(వికెట్ కీపర్), ఆర్. గైక్వాడ్, హేమలత, సిమ్రన్ డిల్ బహదూర్, నవ్‌గైర్.
వన్డే జట్టు: హర్మన్ ప్రీత్ కౌర్(కెప్టెన్), స్మృ తి మంధాన(వైస్ కెప్టెన్), షెఫాలీ వర్మ, ఎస్ మేఘ్న, దీప్తి శర్మ, తానియా, యస్టికా భాటియా(వికెట్ కీపర్లు), పూజ వస్త్రాకర్, స్నేV్‌ా రాణా, రేణుక ఠాకూర్, మేఘ్న సింగ్, ఆర్. గైక్వాడ్, హర్లిన్ డియోల్, హేమలత, సిమ్రన్ డిల్ బహదూర్, జులన్ గోస్వామి, జెమీమా రోడ్రిగ్స్.