Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రసారదారుల డిమాండ్లకు అంగీకారం
- మీడియా హక్కుల వేలం ప్రక్రియ
దుబాయ్ : భారత బ్రాడ్కాస్ట్ మార్కెట్ ఒత్తిడికి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తలొగ్గింది. రానున్న 4/8 ఏండ్లకు మీడియా హక్కుల వేలానికి ఐసీసీ ఇటీవల టెండర్లు ఆహ్వానించింది. రెండు నెలల ముందుగానే మీడియా హక్కుల వేలం ప్రక్రియపై ఐసీసీ విధి విధానాలు రూపొంచింది. కానీ బిడ్ దాఖలు, బిడ్లు తెరవటం సహా రెండో రౌండ్‌కు వెళ్లటంపై ప్రసార సంస్థలకు సందేహాలు ఉన్నాయి. వేలం ప్రక్రియలో నిబంధన లు అన్ని ఐసీసీకి అనుకూలంగా ఉన్నాయని, ప్రసారదారు లకు ఏమాత్రం అమోదయోగ్యం కాదని భారత మార్కెట్ దిగ్గజాలు స్టార్ ఇండియా, వయాకామ్18, సోనీ నెట్‌వర్క్‌లు ఆగస్టు 16, 17న నిర్వహించిన మాక్ వేలాన్ని బహిష్కరిం చారు. ప్రసార సంస్థల డిమాండ్లను ఆరంభంలో పట్టించుకోని ఐసీసీ.. బహిష్కరణ సెగతో ఒత్తిడికి తలొగ్గింది. వేలం ప్రక్రియలో పలు సవరణలు తీసుకొచ్చింది. తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం నాలుగేండ్ల కాలానికి ఐసీస మీడియా హక్కుల కనీస ధర రూ.11.5 వేల కోట్లుగా నిర్దారించినట్టు సమాచారం (1.44 బిలియన్ అమెరికన్ డాలర్లు). ఇక తొలి దశలో బిడ్లను తెరిచిన అనంతరం.. తొలి రెండు బిడ్లకు ధరలో అంతరం 10 శాతం లోపు మాత్రమే ఉంటే.. రెండో రౌండ్ వేలానికి వెళ్లనున్నారు. ఈ దశలో ఈ వేలం వేయనున్నారు. రెండో దేశ వేలానికి తొలి రెండు స్థానాల్లో నిలిచిన సంస్థలతో పాటు అధిక ధర బిడ్‌తో అంతరం 10 శాతం లోపు బిడ్ వేసిన సంస్థలు అన్ని ఈ వేలంలో పాల్గొనే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. తొలి నాలుగేండ్లకు మీడియా హక్కులు దక్కించుకున్న సంస్థ.. మరో నాలుగేండ్లకు హక్కులను పొందాలనుకుంటే 2.8 రెట్లు అధికంగా చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహారణకు తొలి నాలుగేండ్లకు ధర 2 బిలియన్ డాలర్లు అయితే.. తర్వాతి నాలుగేండ్లకు 2.8 రెట్ల ధరతో కలిపి ఓవరాల్‌గా 5.6 బిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది.