Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యుఏఈ ప్రయాణం ఆలస్యం
ముంబయి : ఆసియా కప్‌కు ముందు టీమ్ ఇండియాకు ఎదురుదెబ్బ!. భారత జట్టు చీఫ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కోవిడ్-19 బారిన పడ్డాడు. ఆసియా కప్ కోసం భారత జట్టు ఆగస్టు 23నే యుఏఈకి చేరుకుంది. ప్రయాణానికి ముందు భారత జట్టు శిబిరంలోని అందరికీ రెగ్యులర్ కోవిడ్-19 పరీక్షలు నిర్వహించారు. రాహుల్ ద్రవిడ్ వైరస్ బారిన పడినట్టు బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. 'భారత జట్టు చీఫ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కోవిడ్-19 పాజిటివ్‌గా తేలాడు. యుఏఈకి జట్టు బయల్దేరడానికి ముందు ముందస్తు పరీక్షల్లో ద్రవిడ్ పాజిటివ్‌గా వచ్చాడు. బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో ద్రవిడ్ ఉన్నాడు. కోవిడ్-19 నెగెటెవ్‌గా తేలగానే ద్రవిడ్ యుఏఈలో భారత జట్టుతో పాటు చేరతాడు. ద్రవిడ్ మినహా మిగతా జట్టు ఆగస్టు 23న యుఈఏకి చేరుకుంటుంది' అని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది.
రాహుల్ ద్రవిడ్‌కు కోవిడ్ నేపథ్యంలో బౌలింగ్ కోచ్ పరాస్ తాత్కాలిక చీఫ్ కోచ్ బాధ్యతలు చేపట్టనున్నాడు. ద్రవిడ్ రాగానే తిరిగి పగ్గాలు అప్పగించనున్నాడు. రాహుల్ ద్రవిడ్ కోవిడ్ నుంచి కోలుకునే సమయం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఎన్సీఏ డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్ యుఏఈకి ఆసియా కప్ కోసం వెళ్లే అవకాశం కనిపిస్తోంది. దీనిపై బీసీసీఐ త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంది. గాయాల నుంచి కోలుకుంటూ బెంగళూర్‌లోని జాతీయ క్రికెట్ అకాడమీలో రిహాబిలిటేషన్‌లో ఉన్న జశ్‌ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్ ఫిట్నెస్ రిపోర్టు కోసం సైతం బీసీసీఐ ఎదురుచూస్తోంది.