Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముంబయిపై 55-43తో గెలుపు
పుణె : అల్టిమేట్ ఖోఖో లీగ్‌లో తెలుగు యోధాస్ అదరగొడుతోంది. అటాక్, డిఫెన్స్‌లో తిరుగులేని ప్రదర్శన చేస్తున్న తెలుగు యోధాస్ సీజన్లో నాల్గో విజయం సొంతం చేసుకుంది. మంగళవారం పుణెలో జరిగిన లీగ్ మ్యాచ్‌లో ముంబయి కిలాడీస్పై 55-43తో 12 పాయింట్ల స్పష్టమైన ఆధిక్యంతో విజయం నమోదు చేసింది. తెలుగు యోధాస్ అటాకర్ రోహన్ షింగాడె 11 పాయింట్లు సాధించి ఆకట్టుకున్నాడు. ముంబయి డిఫెండర్ దుర్వేశ్ సాలుంకే 1.44 నిమిషాల పాటు తెలుగు యోధాస్‌ను ఆడించినా.. ముంబయికి ఆదుకోలేకపోయాడు. సచిన్ ఆల్‌రౌండర్ నైపుణ్యం ప్రదర్శించాడు. 3.47 నిమిషాల పాటు డిఫెండ్ చేసిన సచిన్ తెలుగు యోధాస్‌కు మరో మెరుపు విజయాన్ని కట్టబెట్టాడు. తెలుగు యోధాస్ తర్వాతి మ్యాచ్‌లో ఆగస్టు 25న గుజరాత్ జెయింట్స్‌తో తలపడనుంది. ఐదు మ్యాచుల్లో నాలుగు విజయాలతో పాయింట్ల పట్టికలో తెలుగు యోధాస్ అగ్రస్థానంలో నిలిచింది.