Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆసియాకప్‌కు ముందు ప్రధాన జట్లను వేధిస్తోన్న సమస్య
ముంబయి: దుబాయ్ వేదికగా ఈనెల 27నుంచి ప్రారంభం కానున్న ఆసియాకప్‌కు ముందు ప్రధాన జట్లకు ఆటగాళ్ల గాయాల బెడద వేధిస్తోంది. దీంతో గాయపడ్డవారి స్థానంలో కొత్త ఆటగాళ్లకు చోటు కల్పించే పనిలో ఆయా జట్ల క్రికెట్‌బోర్డులు దృష్టి సారించాయి. టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా వెన్నునొప్పి, హర్షల్ పటేల్ పక్కటెముకుల నొప్పులతో ఆసియాకప్ టోర్నీకి ఇప్పటికే దూరమయ్యారు. తాజాగా టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కూడా కరోనా బారిన పడ్డాడు. దీంతో వీరంతా లేకుండానే టీమిండియా జట్టు యుఏఇకి బయల్దేరింది. ద్రావిడ్‌కు కరోనా పాజిటివ్ రావడంతో వివిఎస్ లక్ష్మణ్‌ను దుబాయ్‌కు పంపే పనిలో బిసిసిఐ నిమగమైంది. ఒకవేళ టోర్నీ ప్రారంభమయ్యే సమయానికి ద్రావిడ్‌కు నెగెటివ్ రిపోర్టు వస్తే మాత్రం తొలి ప్రాధాన్యతా క్రమంలో అతడే దుబారుకు పయనం కానున్నాడు.
ఇక పాకిస్తాన్ జట్టు ప్రధాన పేసర్ షాహిన్ అఫ్రిది గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. దీంతో షాహిన్ స్థానంలో కుడిచేతి వాటం పేసర్ మహ్మద్ హస్నైన్కు చోటు కల్పింది పాక్ క్రికెట్ బోర్డు. ఇక శ్రీలంక ఆటగాడు దుష్మంత ఛమీర దగ్గు, జలుబుతో ముందస్తు జాగ్రత్త చర్యలో భాగంగా టోర్నీకి దూరంగా ఉన్నాడు. అలాగే ఎడమచేతి వాటం పేసర్ ప్రమోద్ మధుషన్తోపాటు కసున్ రంజిత కూడా గాయాల కారణంగా ఇప్పటికే టోర్నీకి దూరమయ్యారు. బంగ్లాదేశ్ జట్టులో మాత్రం పేసర్ హసన్ మహ్మద్, వికెట్ కీపర్ నూరుల్ హసన్ దూరం కావడం ఆ జట్టును వేధిస్తోంది. దీంతో ఓపెనింగ్ బ్యాటర్ మహ్మద్ నయీమ్‌కు బంగ్లా క్రికెట్ బోర్డు చోటు కల్పించింది. హెడ్‌కోచ్‌గా దక్షిణాఫ్రికాకు చెందిన రస్సెల్ డోమింగోను ప్రధాన కోచ్‌గా మూడు ఫార్మాట్లకు కొనసాగించాలని బంగ్లా బోర్డు నిర్ణయం తీసుకుంది. టెక్నికల్ కన్సల్టెంట్‌గా మాజీ టీమిండియా క్రికెటర్ శ్రీధర్ శ్రీరామ్ ఎంపికయ్యాడు. అతడు టి20ఫార్మాట్‌కు బంగ్లాజట్టుకు టెక్నికల్ కన్సల్టెంట్‌గా కొనసాగనున్నాడు. శనివారం శ్రీలంక-బంగ్లాదేశ్ జట్ల మధ్య దుబారు వేదికగా జరిగే తొలి మ్యాచ్‌లో 2022 ఆసియాకప్ టోర్నీ ప్రారంభం కానుండగా.. ఆఫ్ఘనిస్తాన్‌తో పాటు మరో జట్టు టోర్నీకి అర్హత సాధించాల్సి ఉంది.
ఆసియాకప్‌లో నాలుగు జట్ల ఆటగాళ్లు..
భారత్: రోహిత్(కెప్టెన్), కేఎల్ రాహుల్(వైస్ కెప్టెన్), కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, జడేజా, అశ్విన్, చాహల్, బిష్ణోరు, భువనేశ్వర్, ఆర్ష్‌దీప్ సింగ్, ఆవేశ్ ఖాన్.
పాకిస్తాన్: బాబర్ అజమ్(కెప్టెన్), షాదాబ్ ఖాన్, ఆసిఫ్ అలీ, ఫకర్ జమాన్, హైదర్ అలీ, హరీస్ రవూఫ్, ఇఫ్తికార్ అహ్మద్, ఖుష్దిల్ షా, మహ్మద్ నవాజ్, రిజ్వాన్, వాసీం జూనియర్, నసీమ్ షా, షహన్వాజ్, ఉస్మాన్ ఖాదిర్, మహ్మద్ హస్నైన్.
శ్రీలంక: దసున్ శనక(కెప్టెన్), గుణతిలకే, నిస్పంక, కుశాల్ మెండీస్, అసలంక, రాజపక్సే, భండార, ధనుంజయ, హసరంగ, తీక్షణ, జెఫ్రీ, జయవిక్రమే, కరుణరత్నే, దిల్షాన్ మదుశనక, మతీష, చండీమాల్, ఫెర్నాండో.
బంగ్లాదేశ్: షకీబ్-అల్-హసన్(కెప్టెన్), ఇనాముల్ హక్, ముష్ఫికర్ రహీమ్, ఆఫిప్ హొసైన్, ముస్సదెక్ హొసైన్, మహ్మదుల్లా, మెహిదీ హసన్, షైఫుద్దీన్, ముస్తఫిజుర్, నసూమ్ అహ్మద్, షబీర్ రెహ్మాన్, మెహిదీ హసన్ మిరాజ్, హొసైన్, పర్వేజ్ హొసైన్, తస్కిన్ అహ్మద్, మహ్మద్ నయీమ్.
ఆ రెండు జట్లకే విజయావకాశాలు
- షేన్ వాట్సన్ జోస్యం
ఆసియాకప్ టైటిల్ విజేతగా నిలిచే అవకాశాల భారత్, పాక్ జట్లకే ఉన్నాయని ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్ జోస్యం చెప్పాడు. భారత్‌ను గత టి20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్ చిత్తుగా ఓడించిందని, ఇన్నాళ్లకు పాక్‌పై బదులు తీర్చుకొనేందుకు భారత్‌కు అవకాశమొచ్చిందని, దీంతో ఇరుజట్ల మధ్య 28న జరిగే తొలి మ్యాచ్‌తోనే ఉత్కంఠ నెలకొందన్నాడు. ఇటీవలికాలంలో పాక్ జట్టు బలీయంగా తయారైందని, ఆ జట్టు కెప్టెన్ బాబర్ అజామ్ దుర్భేధ్య ఫామ్‌లో ఉండడం ఆ జట్టుకు కొండంత బలమని పేర్కొన్నాడు. టి20 ప్రపంచకప్ అనంతరం భారతజట్టు పాక్‌తో తలపడడం ఇదే ప్రథమమని, దీంతో పాక్ జట్టును ఓడించాలన్న పట్టుదలతో భారత్ బరిలోకి దిగడం ఖాయమన్నాడు. టైటిల్ విజేతలు నిలిచే అవకాశాలు ఈ రెండు జట్లకే ఉండడంతో తొలిమ్యాచ్ కీలకంగా మారనుందన్నాడు. తొలి మ్యాచ్‌లో గెలిచిన జట్టుకే టైటిల్ సాధించే అవకాశాలు మెండుగా ఉంటాయని తేల్చిచెప్పాడు.