Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కోల్‌కతా: డురండ్ కప్ ఫుట్‌బాల్ టోర్నీలో భాగంగా బుధవారం ఏటికే మోహన్ బగాన్-ముంబయి సిటీ ఎఫ్‌సి జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రా అయ్యింది. ముంబయిలోని సాల్ట్‌లేక్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో నిర్ణీత సమయం పూర్తయ్యే సరికి ఇరుజట్లు 1-1గోల్స్‌తో సమంగా నిలిచాయి. ఇరుజట్ల మధ్య చివరి నిమిషం వరకు ఉత్కంఠభరితంగా మ్యాచ్ సాగింది. తొలి మ్యాచ్‌లో ఏటికే జట్టు విజయం సాధించగా.. రెండో మ్యాచ్‌ను ఆ జట్టు డ్రాగా ముగించింది.
తొలి అర్ధభాగం 40వ నిమిషంలో ఏటికే మోహన్ బగాన్ ఆటగాడు లిస్టన్ కొలాకో గోల్ కొట్టగా.. రెండో అర్ధభాగం 77వ నిమిషంలో ముంబయి సిటీ ఆటగాడు జార్జి పెరైరా డియోజ్ ఒక గోల్ కొట్టాడు.