Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రి క్వార్టర్స్‌లో లక్ష్యసేన్, శ్రీకాంత్‌కు నిరాశ..
- బిడబ్ల్యుఎఫ్ ప్రపంచ టూర్ ఛాంపియన్షిప్
టోక్యో: బిడబ్ల్యుఎఫ్ ప్రపంచ టూర్ ఛాంపియన్‌షిప్‌లో హెచ్ఎస్ ప్రణయ్ రారు సంచలనం నమోదు చేశాడు. బుధవారం జరిగిన రెండోరౌండ్ పోటీలో ప్రణయ్ 2వ సీడ్, జపాన్‌కు చెందిన కెంటో మొమొటోను ఓడించాడు. ప్రణరు 21-17, 21-16తో మొమొటోపై వరుససెట్లలో గెలుపొందాడు. మరో పోటీలో కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణ పతక విజేత, యువ షట్లర్ లక్ష్యసేన్ 21-17, 21-10తో పెనల్వెర్(స్పెయిన్)పై గెలుపొందగా.. 12వ సీడ్ కిదాంబి శ్రీకాంత్ 9-21, 17-21తో చైనాకు చెందిన జొహౌ చేతిలో ఓటమిపాలయ్యాడు. ఇక పురుషుల డబుల్స్‌లో చిరాగ్‌శెట్టి-సాత్త్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి 21-5, 21-10తో గ్వాటిమాలకు చెందిన సోలిస్-మర్రొగ్వన్ను ఓడించగా.. ధృవ్ కపిల-ఎంఆర్ అర్జున్ జోడీ 8వ సీడ్, డెన్మార్క్క్ఉ చెందిన అస్ట్రప్-రస్ముసేన్పై 21-17, 21-16 విజయం సాధించి ప్రి క్వార్టర్ఫైనల్లోకి దూసుకెళ్లారు. ఇక మహిళల డబుల్స్‌లో పొన్నప్ప-సిక్కిరెడ్డి జోడీ 15-21, 10-21తో చైనాకు చెందిన టాప్‌సీడ్ చెన్ క్వింగ్ చెన్, జియా-యి చేతిలో 42నిమిషాల్లోనే ఓడారు. మరో డబుల్స్ పోటీలో పూజ-సంతోష్ జోడీ 15-21, 7-21తో కొరియాకు చెందిన లీ-షిన్ చేతిలో పరాజయాన్ని చవిచూసారు.