Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆఖరి లీగ్‌లో యుఏఇపై గెలుపు
మస్కట్: ఆసియాకప్ టోర్నీకి హాంకాంగ్ జట్టు అర్హత సాధించింది. ఓమన్ వేదికగా జరిగిన అర్హత టోర్నీలో హాంకాంగ్ జట్టు యుఏఇకి ఓడించి ప్రధాన టోర్నీకి బెర్త్ సంపాదించింది. బుధవారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో హాంకాంగ్ జట్టు యుఏఇ నిర్దేశించిన 148పరుగుల లక్ష్యాన్ని 19ఓవర్లలోనే ఛేదించింది. కువైట్, సింగపూర్లు కూడా అర్హత టోర్నీ బరిలో నిలిచినా.. హాంకాంగ్ జట్టు వరుసగా మూడు విజయాలను నమోదు చేసుకొని అగ్రస్థానంలో నిలిచింది. ఇక యుఏఇ జట్టు రెండు విజయాలు, హాంకాంగ్ చేతిలో ఓటమితో రెండోస్థానానికే పరిమితమైంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో హాంకాంగ్ జట్టు 23వ స్థానంలో ఉండగా.. ఆ జట్టు ఆసియాకప్ టోర్నీకి అర్హత సాధించడం ఇది నాల్గోసారి మాత్రమే. అంతకుముందు 2004, 2008, 2018లో హాంకాంగ్ ఆసియాకప్ టోర్నీలో ప్రాతినిధ్యం వహించింది. టోర్నీ చరిత్రలోనే తొలిసారి టి20 ఫార్మాట్లో జరగనుంది. గ్రూప్-ఏ చోటు దక్కించుకున్న హాంకాంగ్ జట్టు ఈనెల 31న భారత్‌తో, సెప్టెంబర్ 2న పాకిస్తాన్‌తో తలపడనుంది. ఆసియాకప్ టోర్నీ గ్రూప్ లీగ్ మ్యాచ్‌లు 27నుంచి, సూపర్ స్టేజ్-4 మ్యాచ్‌లు సెప్టెరబర్ 3నుంచి జరగనున్నాయి.
గ్రూప్-ఏ: భారత్, పాకిస్తాన్, హాంకాంగ్
గ్రూప్-బి: శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్
ఆసియాకప్‌లో నాలుగు జట్ల ఆటగాళ్లు..
భారత్: రోహిత్(కెప్టెన్), కేఎల్ రాహుల్(వైస్ కెప్టెన్), కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, జడేజా, అశ్విన్, చాహల్, బిష్ణోరు, భువనేశ్వర్, ఆర్ష్‌దీప్ సింగ్, ఆవేశ్ ఖాన్.
పాకిస్తాన్: బాబర్ అజమ్(కెప్టెన్), షాదాబ్ ఖాన్, ఆసిఫ్ అలీ, ఫకర్ జమాన్, హైదర్ అలీ, హరీస్ రవూఫ్, ఇఫ్తికార్ అహ్మద్, ఖుష్దిల్ షా, మహ్మద్ నవాజ్, రిజ్వాన్, వాసీం జూనియర్, నసీమ్ షా, షహన్వాజ్, ఉస్మాన్ ఖాదిర్, మహ్మద్ హస్నైన్.
హాంకాంగ్ : యాసిం ముర్తజా, నిజకత్ ఖాన్(కెప్టెన్), బాబర్ హయాత్, కించిత్ షా, ఐజాజ్ ఖాన్, స్కాట్ మెకంజి(వికెట్ కీపర్), జీషన్ అలీ, హరోన్ అర్హాద్, ఎహసాన్ ఖాన్, మహ్మద్ ఘజన్ఫర్, ఆయుష్ శుక్లా, వాజిద్ షా, ఆఫ్తాబ్ హొసైన్, ధనుంజయ రావు, మహ్మద్ వాహబ్, త్రివేది, అతీక్ ఇక్బాల్.
శ్రీలంక: దసున్ శనక(కెప్టెన్), గుణతిలకే, నిస్పంక, కుశాల్ మెండీస్, అసలంక, రాజపక్సే, భండార, ధనుంజయ, హసరంగ, తీక్షణ, జెఫ్రీ, జయవిక్రమే, కరుణరత్నే, దిల్షాన్ మదుశనక, మతీష, చండీమాల్, ఫెర్నాండో.
బంగ్లాదేశ్: షకీబ్-అల్-హసన్(కెప్టెన్), ఇనాముల్ హక్, ముష్ఫికర్ రహీమ్, ఆఫిప్ హొసైన్, ముస్సదెక్ హొసైన్, మహ్మదుల్లా, మెహిదీ హసన్, షైఫుద్దీన్, ముస్తఫిజుర్, నసూమ్ అహ్మద్, షబీర్ రెహ్మాన్, మెహిదీ హసన్ మిరాజ్, హొసైన్, పర్వేజ్ హొసైన్, తస్కిన్ అహ్మద్, మహ్మద్ నయీమ్.
ఆఫ్ఘనిస్తాన్: మహ్మద్ నబి(కెప్టెన్), హష్మదుల్లా షాహిది, హజ్రలుల్లా జజారు, ఇబ్రహీం జడ్రాన్, నజీబుల్లా జడ్రాన్, ఉస్మాన్ ఘని, అజ్మతుల్లా, కరీమ్ జనత్, సమీవుల్లా షిన్వారీ, షరాఫుద్దీన్ అర్షాద్, అఫ్సర్ జజారు, రమానుల్లా జడ్రాన్ (వికెట్ కీపర్లు), ఫరీద్ అహ్మద్, ఫరూఖీ, ముజీబ్-ఉర్-రెహ్మాన్, నవీన్-ఉల్-హక్, నిజద్ మసూద్, నూర్ అహ్మద్, క్విస్ అహ్మద్, రషీద్ ఖాన్.