Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సైనా, సింధు ఔట్..
- బిడబ్ల్యుఎఫ్ ప్రపంచ ఛాంపియన్షిప్స్
టోక్యో: బిడబ్ల్యుఎఫ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ రాయ్ క్వార్టర్ఫైనల్లోకి దూసుకెళ్లాడు. గురువారం జరిగిన ప్రి క్వార్టర్స్ పోటీలో ప్రణయ్ మూడుసెట్ల హోరాహోరీ పోరులో సహచర షట్లర్, కామన్వెల్త్ క్రీడల స్వర్ణ పతక విజేత లక్ష్యసేన్‌ను ఓడించాడు. ప్రి క్వార్టర్స్‌లో ప్రణరు 17-21, 21-16, 21-17తో లక్ష్యసేన్‌ను ఓడించాడు. ఇరువురు షట్లర్ల మధ్య ఈ పోటీ సుమారు గంటా 15నిమిషాలసేపు సాగింది. క్వార్టర్ఫైనల్లో ప్రణరు చైనాకు చెందిన ఝో-జన్-పెంగ్‌తో తలపడనున్నాడు. ఇక మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్, పివి సింధు పరాజయం పాలయ్యారు. సైనా నెహ్వాల్ 17-21, 21-16, 13-21తో ఓంగ్బంమ్రుపా(థారులాండ్) చేతిలో పోరాడి ఓటమిపాలైంది. ఇక పివి సింధు రెండోరౌండ్లో గాయం కారణంగా టోర్నీనుంచి నిష్క్రమించింది.
డబుల్స్‌లో క్వార్టర్స్‌కు రెండు జోడీలు..
పురుషుల డబుల్స్ క్వార్టర్ఫైనల్లోకి భారత్‌కు చెందిన రెండు జోడీలు క్వార్టర్ఫైనల్లోకి దూసుకెళ్లాయి. తొలి ప్రిక్వార్టర్స్‌లో చిరాగ్‌శెట్టి-సాత్త్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి జోడీ 21-12, 21-10తో డెన్మార్క్‌కు చెందిన బే-మొల్హెదేను ఓడించారు. క్వార్టర్స్‌లో భారతజోడీ ఇండోనేషియాకు చెందిన సెటైవాన్-అహసాన్తో తలపడనున్నారు. మరో ప్రి క్వార్టర్స్ పోటీలో ధృవ్ కపిల-ఎంఆర్ అర్జున్ జోడీ 18-21, 21-15, 21-16తో సింగపూర్ జోడీని చిత్తుచేశారు. క్వార్టర్స్‌లో వీరు జపాన్ జోడీతో తలపడనున్నారు.