Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రపంచ చాంపియన్, కామన్వెల్త్ గేమ్స్ బంగారు పతక విజేత నిఖత్ జరీన్ పర్యవేక్షణలో త్వరలోనే అక్షర ఇంటర్నేషనల్ స్కూల్లో బాక్సింగ్ అకాడమీ ఏర్పాటు చేయనున్నట్టు అర్శనపల్లి జగన్మోహన్ రావు తెలిపారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ, కేంద్ర క్రీడా ప్రాధికార సంస్థ (సారు) సంయుక్తంగా నిర్వహించిన 'మీట్ ద చాంపియన్' కార్యక్రమంలో భాగంగా భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ సోమవారం ఎల్బీనగర్లోని అక్షర ఇంటర్నేషనల్ స్కూల్ చిన్నారులను కలిశారు. సంతులిత ఆహారం, పోషకాహార లోపం అధిగమించటం సహా వ్యాయామం అవసరం, ప్రాధాన్యతలపై విద్యార్థులతో ముచ్చటించారు. వరల్డ్ చాంపియన్ నిఖత్ జరీన్‌కు గొప్ప స్వాగతం పలికారు. విద్యార్థినీలతో కలిసి నిఖత్ జరీన్ బాస్కెట్‌బాల్ ఆడి అలరించారు. కార్యక్రమంలో అక్షర విద్యాసంస్థల సీఈఓ అర్శనపల్లి మదన్మోహన్రావు, ప్రిన్సిపాల్ రమణి వారణాసి, సారు కోచ్‌లు తదితరులు పాల్గొన్నారు.