Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్రోయేషియా క్లబ్‌తో ఏడాది కాంట్రాక్టు సొంతం
హైదరాబాద్ : భారత ఫుట్‌బాల్ జట్టు మిడ్ ఫీల్డర్, తెలంగాణ క్రీడాకారిణి గగులోతు సౌమ్య సరికొత్త అవకాశం దక్కించుకుంది. ఓ విదేశీ ఫుట్‌బాల్ క్లబ్ కాంట్రాక్టు దక్కించుకున్న తొలి భారత మహిళా ఫుట్‌బాల్ క్రీడాకారిణిగా నిలిచింది. వివిధ టోర్నీల్లో సుమారు 46 టైటిళ్లు సాధించిన క్రోయేషియాకు చెందిన జిఎన్‌కె డైనామో జాగ్రెబ్ క్లబ్ గుగులోతు సౌమ్యతో ఏడాది పాటు కాంట్రాక్టు కుదుర్చుకుంది. మధ్యప్రదేశ్‌కు చెందిన మరో క్రీడాకారిణి జ్యోతి చౌహాన్ సైతం సౌమ్యతో పాటు డైనామో జాగ్రెబ్ తరఫున బరిలోకి దిగేందుకు రంగం సిద్ధం చేసుకుంది. కోల్‌కతలో లోకల్ బార్సుతో మ్యాచుల్లో ప్రదర్శన అనంతరం సౌమ్య, జ్యోతిలను డైనామా జాగ్రెబ్ క్రోయేషియాను తీసుకెళ్లింది. అక్కడ క్లబ్ ప్రీ సీజన్ మ్యాచుల్లో అవకాశం కల్పించింది. సౌమ్య, జ్యోతి నైపుణ్యాలు క్లబ్ విజయాలకు తోడ్పాటు అందించగలవని భావించి, ఏడాది పాటు ఒప్పందం చేసుకున్నారు. ఈ ఏడాది ఆరు విదేశీ సాకర్ క్లబ్‌లు సౌమ్య, జ్యోతిలను తీసుకునేందుకు ఆటతీరు, టెక్నిక్, సామర్థ్యంపై అంచనా వేశాయి.