Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తొలి పోరులో కేరళతో బెంగాల్ ఢీ
ముంబయి : ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎల్ఎల్) 2022-23 సీజన్ షెడ్యూల్ వచ్చేసింది. ఈ ఏడాది అక్టోబర్ 7న కేరళ బ్లాస్టర్స్, ఈస్ట్ బెంగాల్ ఎఫ్‌సీ మ్యాచ్‌తో ఫుట్‌బాల్ లీగ్ ఆరంభం కానుంది. ప్లే ఆఫ్స్, సెమీఫైనల్స్, ఫైనల్స్ కాకుండా ఈ ఏడాది లీగ్ దశ మ్యాచులే సుమారు ఐదు నెలల పాటు సాగనున్నాయి. లీగ్ దశలో ప్రతి జట్టు 20 మ్యాచులు ఆడనుండగా.. అందులో పది మ్యాచుల్లో సొంతగడ్డపై, మరో పది మ్యాచులు ప్రత్యర్థి మైదానంలో ఆడనున్నాయి. డిఫెండింగ్ హైదరాబాద్ ఎఫ్‌సీ టైటిల్ వేట అక్టోబర్ 9న షురూ కానుంది. గచ్చిబౌలిలోని అథ్లెటిక్ స్టేడియంలో ముంబయి ఎఫ్‌సీతో హైదరాబాద్ ఎఫ్‌సీ తొలి మ్యాచ్‌లో తలపడనుంది. ఈ సీజన్లో ఫార్మాట్‌ను సైతం కాస్త మార్పు చేశారు. లీగ్ దశలో టాప్-2 జట్లు నేరుగా సెమీఫైనల్స్‌కు అర్హత సాధించనున్నాయి. 3-6 స్థానాల్లో నిలిచిన జట్లు ఎలిమినేటర్‌లో ఆడాల్సి ఉంటుంది. ఈ మ్యాచుల్లో విజేతలకు సెమీస్ బెర్త్‌లు దక్కనున్నాయి.