Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కౌలాలంపూర్ : కరోనా మహమ్మారి ప్రభావంతో బ్యాడ్మింటన్ టోర్నీలు వరుసగా మూడో ఏడాది రద్దుగా ముగిశాయి. ఈ ఏడాది నవంబర్‌లో జరగాల్సిన హాంగ్‌కాంగ్ ఓపెన్, మకావు ఓపెన్లను రద్దు చేస్తున్నట్టు ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బిడబ్ల్యూఎఫ్) గురువారం వెల్లడించింది. హాంగ్‌కాంగ్‌లో ఇప్పటికీ కోవిడ్-19 ఆంక్షలు కొనసాగుతున్నాయి. బ్యాడ్మింటన్ టోర్నీ నిర్వహణ కోసం ప్రత్యేక అనుమతుల కోసం అధికారులను కోరినా.. ఎటువంటి మినహాయింపులు లభించలేదు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు తప్పనిసరి క్వారంటైన్ పూర్తి చేసుకోవాల్సి ఉంది. దీంతో వరుసగా మూడో ఏడాది హాంగ్‌కాంగ్ ఓపెన్‌ను రద్దు చేశారు. మకావు ఓపెన్ సైతం ఈ ఏడాది నిర్వహించటం లేదు. అక్కడా, కోవిడ్ ఆంక్షలు ఇంకా కొనసాగుతున్నాయి.