Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రోడ్‌సేఫ్టీ వరల్డ్ సిరీస్ సీజన్ 2
ముంబయి : క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఇండియా లెజెండ్స్‌కు సారథ్యం వహించనున్నాడు. రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ రెండో సీజన్ సెప్టెంబర్ 10న ఆరంభం కానుంది. తొలి సీజన్లో ఇండియా లెజెండ్స్ చాంపియన్‌గా నిలువగా.. టైటిల్ వేటకు మాస్టర్ బ్లాస్టర్ సారథ్యం వహించనున్నాడు. ఆరంభ మ్యాచ్‌కు కాన్పూర్ వేదిక కానుండగా.. టైటిల్ పోరు రారుపూర్‌లో జరుగనుంది. ఇండోర్, డెహ్రాడూన్లు ఈ టోర్నీకి ఆతిథ్యం ఇవ్వనున్నాయి. అక్టోబర్ 1న ఫైనల్స్ జరుగనుంది. ఈ సీజన్లో కొత్త న్యూజిలాండ్ లెజెండ్స్ ఆడనుంది. ఆస్ట్రేలియా, శ్రీలంక, భారత్, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్ లెజెండ్స్ జట్టు తాజా సీజన్లో పోటీపడనున్నాయి. ప్రతి ఏడాది రోడ్డు ప్రమాదంలో మరణిస్తున్న వారి సంఖ్య భారత్‌లో ఆందోళనకరంగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా 30 శాతం మరణాలు భారత్‌లోనే సంభవిస్తున్నాయి. రోడ్డు భద్రతపై అవగాహన కల్పించటమే లక్ష్యంగా రిటైర్డ్ క్రికెటర్లతో వరల్డ్ సిరీస్ నిర్వహిస్తున్నారు.